అన్వేషించండి

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పేరును బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సంచలనంగా మారింది. కర్ణాటకలో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు ప్రకాష్‌రాజ్ పేరు బెంగళూరు ఓటర్ల జాబితా నుండి తొలగించబడింది.
  • రాష్ట్రంలో 65 లక్షల ఓట్ల తొలగింపులో తన పేరుండటంపై ఆశ్చర్యం.
  • ఓటు తొలగింపును రాజకీయ చర్యగా విమర్శించి, పోరాడతానన్నారు.
  • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మరణించిన, తప్పుల పేర్లు తొలగింపు.

Prakash Raj: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే బెంగళూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తన పేరు మాయమైందని నటుడు ప్రకాష్‌రాజ్ వెల్లడించారు. ఆగస్టు 11న ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అనర్హుల తొలగింపు ప్రక్రియలో భాగంగా సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. అందులో తన పేరు కూడా ఉండటం ఒక జోక్ అని ఆయన అభివర్ణించారు. 

ప్రకాష్ రాజ్ ప్రశ్నలు 

తన వీడియో సందేశంలో ప్రకాష్‌ రాజ్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. " నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా పాఠశాల విద్య, కళాశాల, థియేటర్ ఆర్ట్స్ అన్నీ ఇక్కడే సాగాయి. చివరకు నేను ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాను. అలాంటి నా ఓటు  హక్కును తొలగించడం ఆశ్చర్యం" అని అన్నారు. 

ఈ విషయాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడకుండా, రాజకీయ కోణంలో ఆయన విమర్శలు చేశారు. తన టును తిరిగి పొందే ప్రక్రియ ఏంటో తాను చూస్తానని, గేమ్‌ అన్ అంటూ అధికారులకు, పాలకులకు సవాల్ విసిరారు. " మీకు ఓటు వేయని పౌరుల ఓటు హక్కును మీ అధికారంతో అడ్డుకోగలరేమో కానీ మిమ్మల్ని గద్ద దింే ప్రజాశక్తిని ఆపగలరా?" అంటూ ప్రశ్నించారు. 

సర్ ప్రక్రియ అంటే ఏంటీ?

ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపట్టింది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడానికి మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్న సందర్భాలు లేదా నివాసం మారిన వారి వివరాలను పరిశీలించి జాబితాను అప్‌డేట్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎవరి పేర్ల మీదైనా అభ్యంతరాలు ఉంటే, సంబంధిత ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌ విషయంలో కూడా ఇదే జరిగిందని, ఆయన తన ఓటును పునరుద్దరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. 

ఓటు హక్కును పక్కన పెడితే ప్రకాష్‌ రాజ్ ఇటీవల జార్ఖండ్‌ రాజధాని రాంచీలో విద్యార్థులపై లాఠీచార్జీని కూడా తీవ్రంగా ఖండించారు. జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు టియర్ గ్యాస్‌ గోళాలు ప్రయోగించారు. ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాష్‌ రాజ్‌ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆయన డెకాయిట్‌, జన నాయగన్, దృశ్యం 3లో కనిపించారు. రాబోయే కాలంలో ఆయన భారీ ప్రాజెక్టుల్లో కనిపించనున్నారు. ఎస్‌ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి, సందీప్‌ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్‌ చిత్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. 

Frequently Asked Questions

నటుడు ప్రకాష్‌రాజ్ పేరు ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించబడింది?

కర్ణాటకలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ క్రమంలోనే ప్రకాష్‌రాజ్ పేరు కూడా తొలగించబడింది.

వ్యాసంలో పేర్కొన్న 'సర్ ప్రక్రియ' అంటే ఏమిటి?

ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడానికి ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ ఇది. మరణించిన, నకిలీ లేదా నివాసం మారిన వారి పేర్లను తొలగించి జాబితాను అప్‌డేట్ చేస్తుంది.

తన పేరు తొలగింపుపై ప్రకాష్‌రాజ్ ఎలా స్పందించారు?

ఇది ఒక జోక్ అని, సాంకేతిక లోపంగా కాకుండా రాజకీయ కోణంలో విమర్శించారు. తన ఓటు హక్కును తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటానని, ఇది 'గేమ్ ఆన్' అంటూ సవాల్ విసిరారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు ఏమి చేయాలి?

తమ పేర్లు తొలగించబడిన ఓటర్లు తమ వివరాలను అధికారుల వద్ద ధృవీకరించుకోవాలి. ప్రకాష్‌రాజ్ కూడా తన ఓటును పునరుద్ధరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget