దిగ్గజ నటుడు శివకుమార్ నటిస్తున్న రోజుల్లో ఆయన షూటింగ్ సెట్స్‌కు చిన్నతనంలో సూర్య, కార్తీ తరచూ వెళ్లేవారని, ఆ రోజుల్లోని మధుర జ్ఞాపకాలను ప్రముఖ నటుడు సూర్య తాజాగా గుర్తు చేసుకున్నారు. 'విశ్వాంత్ అండ్ సన్స్' (Vishwanth and Sons) సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తమ కుటుంబంతో సీనియర్ నటి రాధికకు ఉన్న ప్రత్యేక అనుబంధం, ఆమె తమ కుటుంబానికి చేసిన సహాయాన్ని సూర్య ఎమోషనల్‌గా పంచుకున్నారు.