అన్వేషించండి

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ

Electric Bike: హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ మార్కెట్లోకి తేవడానికి వర్క్ చస్తోంది. UBEX, VXZ ప్లాట్‌ఫారమ్‌లపై రూపొందే ఈ బైక్ 2027లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో మోటోకార్ప్ తొలి ఎలక్ట్రిక్ బైకు 2027లో విడుదల చేయనుంది.
  • కమ్యూటర్, ప్రీమియం బైక్‌ల కోసం రెండు ప్లాట్‌ఫారమ్‌లు సిద్ధం.
  • ఫిక్స్డ్, మార్చగలిగే బ్యాటరీలతో పాటు అధునాతన ఫీచర్లుంటాయి.
  • ధర రూ.1.20-1.50 లక్షలు, ఓలా వంటి వాటికి పోటీ.

Hero Electric Motorcycle | భారత్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ (EV) సెగ్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం ఈవీ బైక్‌లు, స్కూటర్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్‌మెంట్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.

 హీరో మోటోకార్ప్ తీసుకుంటున్న నిర్ణయం ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), బజాజ్ ఆటో, టీవీఎస్ వంటి దిగ్గజ కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుంది. ఆటో నివేదికల ప్రకారం, హీరో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను 2027 నాటికి భారత మార్కెట్‌లో ప్రారంభించనుంది. రోజువారీ వాడకంతో పాటు లాంగ్ జర్నీలకు కూడా చాలా సులభంగా, చౌకగా మార్చేలా యువతకు నచ్చేలా శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను అందించడం కంపెనీ లక్ష్యం.

UBEX, VXZ ప్లాట్‌ఫారమ్‌లపై వర్క్
హీరో మోటోకార్ప్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం 2 అత్యంత అడ్వాన్స్‌డ్, విభిన్న ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి ప్లాట్‌ఫారమ్‌ను UBEX కాగా, రెండవదానిని VXZ అని పిలుస్తారు. UBEX ప్లాట్‌ఫారమ్‌ను ప్రత్యేకంగా ప్రతిరోజూ ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లే సిటీ రైడర్‌ల కోసం డిజైన్ చేస్తున్నారు.

అందులోభాగంగా కమ్యూటర్, యుటిలిటీ సెగ్‌మెంట్‌కు చెందిన చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌లు తయారుకానున్నాయి. మరోవైపు VXZ ప్లాట్‌ఫారమ్‌ను హై-పెర్ఫార్మెన్స్, ప్రీమియం, స్పోర్టీ లుక్స్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌ కోసం ఉపయోగిస్తారు. 2 వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లపై పనిచేయడం వల్ల హీరో వద్ద అన్ని రకాల వినియోగదారుల కోసం, బడ్జెట్ కస్టమర్ల కోసం సొల్యూషన్ దొరకనుంది. 

Also Read: BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

బైక్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్

ఈ బైక్‌లో ఫిక్స్‌డ్, స్వ్యాపబుల్ (మార్చగలిగే) 2 రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. రోజువారీ వాడకం కోసం వచ్చే బేస్ మోడల్‌లో 3.5 kWh నుండి 4 kWh వరకు బ్యాటరీ ప్యాక్ ఇవ్వొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 130 నుండి 150 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది.

ప్రీమియం స్పోర్టీ మోడల్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల కేవలం అర గంటలోనే బైక్ చాలా వరకు ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ పవర్‌ఫుల్ టార్క్ ఎక్కేటప్పుడు, ఓవర్‌టేక్ చేసే సమయంలో అద్భుతమైన పికప్‌ అందిస్తుంది.

ఎన్నో మోడ్రన్ ఫీచర్లు

హీరో తన ఈ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఎన్నో హై-టెక్ ఫీచర్లతో తీసుకురానుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ లేదా టీఎఫ్‌టీ (TFT) డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. ఇది బ్లూటూత్, GPS కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కి కనెక్ట్ చేసి టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్- మెసేజ్ అలర్ట్స్, రైడ్ స్టాట్స్ చూడవచ్చు. ఇందులో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో-ఫెన్సింగ్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా చేర్చుతారు.

ఈ బైక్ ధర ఎంత

హీరో మోటోకార్ప్ నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 2027లో భారత రోడ్లపై పరుగులు తీయవచ్చు.  ధర విషయానికొస్తే,  దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. లాంచ్ అయిన తర్వాత ఇది  ఓలా రోడ్‌స్టర్ సిరీస్, బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లు, రివోల్ట్ RV400 వంటి బైక్‌లతో పోటీ పడుతుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన హీరో భారీ డీలర్‌షిప్ నెట్‌వర్క్, నమ్మకమైన సర్వీస్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే గేమ్-చేంజర్‌గా మారవచ్చునని కంపెనీ భావిస్తోంది. 

Frequently Asked Questions

హీరో మోటోకార్ప్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు మార్కెట్లోకి రానుంది?

హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను 2027 నాటికి భారత మార్కెట్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశీయ వినియోగదారుల కోసం అందుబాటులోకి వస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ఏ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తుంది?

హీరో మోటోకార్ప్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం UBEX మరియు VXZ అనే రెండు అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేస్తోంది. UBEX సిటీ రైడర్‌ల కోసం, VXZ హై-పెర్ఫార్మెన్స్ బైక్‌ల కోసం ఉద్దేశించబడ్డాయి.

హీరో ఎలక్ట్రిక్ బైక్‌ ప్రారంభ ధర మరియు బేస్ మోడల్ రేంజ్ ఎంత ఉండవచ్చు?

ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. బేస్ మోడల్ 3.5-4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకసారి ఛార్జ్ చేస్తే 130-150 కి.మీ. రేంజ్ అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget