అన్వేషించండి

Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?

Hydrogen Cars and Buses:భారత్ రవాణా వ్యవస్థలో హైడ్రోజన్ వెహికల్స్‌ హవా మొదలు కానుంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద కార్లు, బస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ట్రైన్‌ కూడా పట్టాలెక్కింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశం పది కోచ్‌లతో తొలి హైడ్రోజన్ రైలు నడిపింది.
  • కాలుష్య నియంత్రణకు హైడ్రోజన్ వాహనాల అభివృద్ధి; బస్సులు సిద్ధం.
  • హైడ్రోజన్ కార్లు పరీక్షిస్తున్నారు; రీఫ్యూయలింగ్ స్టేషన్లు లేక ఆలస్యం.
  • పెట్రోల్ కన్నా హైడ్రోజన్ మెరుగైన మైలేజ్, కాలుష్యరహిత ప్రయాణం.

Hydrogen Cars and Buses:భారత్‌ రవాణా రంగంలో మరో కీలక అడుగు పడింది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, బొగ్గు, సీఎన్జీ, ఎలక్ట్రిక్  వాహనాల గురించి మాత్రమే విన్నారు. ఇప్పుడు తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలు ఎక్కింది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ హైడ్రోజన్ రైలు నడపడంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా పది కోచ్‌లను నడిపి ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని చూపించింది. అయితే ఇప్పుడు కార్లు, బస్‌లు కూడా హైడ్రోజన్‌తో నడిపించే వీలు ఉంటుందా? టూవీలర్స్‌ కూడా వస్తాయా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. 

హైడ్రోజన్‌తో నడిచే బస్‌లు వస్తున్నాయా?

భారత్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాలపై ఆధారపడే పరిస్థితిని పూర్తిగా తగ్గించాలని భావిస్తోంది. అందుకే నేషనల్‌ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను భుజానకెత్తుకొని అందుకు తగ్గట్టుగా ప్లాన్స్‌ చేస్తోంది. అందులో భాగమే ఇప్పుడు హర్యానాలోని జింద్‌లో నడుస్తున్న హైడ్రోజన్ ట్రైన్.  ఈ ట్రైన్ అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు తర్వాత రవాణా వ్యవస్థలపై పడింది. ఇందుకు తగ్గట్టుగానే చాలా కంపెనీలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వాహనాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. టాటా మోటార్స్ అశోక్‌ లేలాండ్‌ వంటి సంస్థలు ఇప్పటికే హైడ్రోజన్ బస్‌లు సిద్ధం చేస్తున్నాయి. ఎన్టీపీసీ ఢిల్లీ, లేహ్ లో పైలట్ ప్రాజెక్టు కుంద హైడ్రోజన్ బస్‌లను విజయవంతంగా నడుపుతోంది. ఇవి ఆగ్రా-ఢిల్లీ, ముంబై-పూణే, అహ్మదాబాద్-సూరత్‌ మధ్య పది రూట్స్‌లో 37 హైడ్రోజన్ బస్‌లు, ట్రక్కులు నడుపుతున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ప్రజారవాణాలో ఈ బస్‌లు రానున్నాయి. 

హైడ్రోజన్‌తో నడిచే కార్లు ఎప్పటి నుంచి రావచ్చు 

కార్ల విషయానికి వస్తే ఇప్పటికే కొన్ని దేశాల్లో టయోటా మిరాయ్, హ్యుందాయ్‌ నెక్సో వంటి హైడ్రోజన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో పరీక్షలు చేస్తున్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ హైడ్రోజన్ కారు నడిపారు. అయితే దేశవ్యాప్తంగా హైడ్రోజన్ రీఫ్యూయలింగ్‌ స్టేషన్లు అందుబాటులో లేనందున హైడ్రోజన్ కార్లు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. ఒకసారి ఇలాంటి స్టేషన్‌కు అనుమతి లభిస్తే మాత్రం ఈవీలు మాదిరిగానే  హైడ్రోజన్‌తో నడిచే కార్లు వచ్చేస్తాయి. 

హైడ్రోజన్‌తో నడిచే టూవీలర్స్‌ వస్తాయా?

హైడ్రోజన్‌తో టూవీలర్స్‌ నడపడం అంత ఈజీ కాదు. ఇది సవాల్‌తో కూడిన వ్యవహారం. హైడ్రోజన్ గ్యాస్‌ చాలా ఎక్కువ ప్రెజర్‌తో ఉంటుంది. దీన్ని స్ట్రాంగ్‌ సిలిండర్స్‌లో ఉండాలి. టూవీలర్స్‌లో స్పేస్ తక్కువగా ఉంటుంది. అందులో అమర్చాలి అంటే సవాలే. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతానికి ఈవీ టూవీలర్స్‌ పైనే దృష్టి పెట్టారు. 

పెట్రోల్‌, హైడ్రోజన్‌ మధ్య వ్యత్యాసం ఏంటి?

పెట్రోల్‌, హైడ్రోజన్ ఇంధనాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పెట్రోల్ వాహనాలు సాధారణంగా లీటర్‌కు 15-20 కిలోమీటర్ల మైలేజీ వస్తే, హైడ్రోజన్‌ కిలోకు 100-140కిలోమీటర్‌ మైలేజీ ఇస్తుంది. పెట్రోల్‌ ప్రతి కిలోమీటర్‌కు సుమారు 6 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగితే ప్రతి కిలోమీటర్‌కు 3 నుంచి ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 

పెట్రోల్‌ నింపుకునే వాహనాలు 8 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలు పాతికల లక్షల నుంచి మొదలుకానున్నాయి. పెట్రోల్‌తో నడిచే వాహనాల నుంచి కార్బన్ ఉద్గారాలు, పొగ, విపరీతమైన వాయుకాలుష్యం విడుదలవుతుంది. హైడ్రోజన్తో నడిచే వాహనాల నుంచి ఎలాంటి కాలుష్యం రాదు. కారు సైలెన్సర్ నుంచి పొగకు బదులు స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. 

సీఎన్జీ vs హైడ్రోజన్‌ వాహనాలు 

సీఎన్జీ వాహనాల్లో మిథేన్ గ్యాస్ నింపుతారు. సాధారణ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఉంటుంది. దీని నుంచి కార్బన్ డయాక్సైడ్, స్వల్పంగా హైడ్రోకార్బన్లు వెలువడతాయి. సుమారు 3600పీఎస్‌ఐ పీడనం వద్ద నిల్వచేస్తారు.  హైడ్రోజన్ వాహనాలు స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువు నింపుతారు. ఫ్యూయల్‌ సెల్‌ టెక్నాలజీ వాడుతుంటారు. కాలుష్యం ఉండదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. సుమారు పదివేల పీఎస్‌ఐ అత్యధిక పీడనం అవసరమవుతుంది. సీఎన్జీ కేజీకి ఇరవై నుంచి 30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 

Frequently Asked Questions

భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్‌ రైలు ఎక్కడ పట్టాలు ఎక్కింది?

హర్యానాలోని జింద్‌లో భారత్‌ తొలి హైడ్రోజన్‌ రైలు పట్టాలు ఎక్కింది. ఇది పది కోచ్‌లను నడిపి సరికొత్త రికార్డు సృష్టించింది.

భారత్‌లో హైడ్రోజన్‌తో నడిచే బస్‌లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?

టాటా మోటార్స్, అశోక్‌ లేలాండ్‌ వంటి సంస్థలు హైడ్రోజన్ బస్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో ప్రజారవాణాలో ఈ బస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

భారత్‌లో హైడ్రోజన్‌ కార్లు అందుబాటులోకి రావడానికి ప్రధాన అడ్డంకి ఏమిటి?

దేశవ్యాప్తంగా హైడ్రోజన్ రీఫ్యూయలింగ్‌ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం ప్రధాన అడ్డంకి. స్టేషన్లకు అనుమతి లభిస్తే, హైడ్రోజన్‌తో నడిచే కార్లు త్వరగా వస్తాయి.

పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే హైడ్రోజన్‌ వాహనాల ప్రధాన ప్రయోజనం ఏమిటి?

హైడ్రోజన్‌ వాహనాల నుంచి ఎలాంటి కాలుష్యం రాదు, కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. పెట్రోల్‌ వాహనాలు కార్బన్ ఉద్గారాలు, పొగను విడుదల చేస్తాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget