అన్వేషించండి

1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

Indias 1st Hydrogen Train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తూ కాలుష్యరహితంగా అందరికీ మేలు చేస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని మోదీ జింద్‌లో భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించారు.
  • స్వదేశీ పరిజ్ఞానంతో 10 కోచ్‌ల రైలు కాలుష్యరహితంగా నడుస్తుంది.
  • హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్యతో శక్తిని ఉత్పత్తి చేస్తూ ప్రయాణిస్తుంది.
  • బహుళ భద్రతా వ్యవస్థలతో జింద్-సోనిపత్ మార్గంలో సేవలు అందిస్తుంది.

1st Hydrogen Train In India: భారత్‌లో తొలి పర్యావరణహిత హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్‌ల రైలు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్- సోనిపత్ మధ్య సేవలు అందిస్తుంది.

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేస్తూ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజినీర్లు ఈ మోడ్రన్ రైలును రూపొందించారు. స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్ల తర్వాత భారత రైల్వే ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచింది.

హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే..

హైడ్రోజన్ రైలు సాధారణ విద్యుత్ రైళ్లలా కాకుండా, తన శక్తిని తానే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందులోని 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్ ప్లాంట్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ 3,200 హెచ్‌పీ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా మోటార్లకు అంది, రైలు గంటకు దాదాపు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. ఇంధన దహనచర్య లేకపోవడం వల్ల హైడ్రోజన్ రైలు నుంచి కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతాయి. హానికారక కర్బన ఉద్గారాలు, శబ్ద కాలుష్యం లేని పర్యావరణహిత ప్రయాణం వీలవుతుంది.

Also Read: Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

ఈ రైలులో అత్యున్నత రక్షణ ప్రమాణాలతో కూడిన పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ లీకేజీలు, వేడి లేదా మంటలను క్షణాల్లో గుర్తించి అప్రమత్తం చేసే ఆటోమేటిక్ షట్‌ఆఫ్ వ్యవస్థను సెటప్ చేశారు.  నిరంతర వెంటిలేషన్ సౌకర్యం వల్ల ఒకవేళ లీకేజీ జరిగినా గ్యాస్ గాల్లో కలిసిపోతుంది. లోకోపైలట్ కేబిన్‌ను సైతం ప్రత్యేకంగా డిజైన్ చేసి, అన్ని భద్రతా అంశాలను పర్యవేక్షించేలా ఇందులో స్క్రీన్‌ను అమర్చి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ రైలు నిర్వహణ కోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, డిస్పెన్సింగ్ కేంద్రాన్ని నిర్మించారు.

తొలి దశలో ఈ హైడ్రోజన్ రైలు నార్త్ రైల్వే పరిధిలోని హర్యానాలోని జింద్- సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో 12 స్టేషన్లలో హాల్ట్ ద్వారా ప్రయాణించనుంది. రానున్న రోజుల్లో కల్కా- షిమ్లా వంటి మార్గాల్లోనూ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా వంటి దేశాల్లో 2 నుండి 4 కోచ్‌లతో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా, భారత్ మాత్రం రికార్డు స్థాయిలో 10 కోచ్‌లతో, ఒకేసారి 2,600 మంది ప్రయాణించేలా రైలును తీసుకొచ్చారు. 

అరుదైన దేశాల జాబితాలో భారత్

ప్రస్తుతం చైనా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అమెరికాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా తాజాగా  భారత్ వాటి సరసన చేరింది. ఈ రైళ్లు హైడ్రోజన్, ఆక్సిజన్‌ను విద్యుత్తుగా మార్చేందుకు హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ ఉపయోగిస్తాయి. చివరగా ప్రక్రియ పూర్తయ్యాక కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేయడంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. భారత్ సైతం త్వరలో మరిన్ని ప్రాంతాలకు హైడ్రోజన్ రైళ్లను ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేనుంది. 

 

Frequently Asked Questions

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఎవరు ప్రారంభించారు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ రైలును ప్రారంభించారు. ఇది 10 కోచ్‌లతో కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది.

హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

ఇది ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్ ప్లాంట్‌తో హైడ్రోజన్, ఆక్సిజన్ల రసాయన చర్య ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది, కాలుష్యం ఉండదు.

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?

తొలి దశలో ఈ రైలు హరియాణాలోని జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో 12 స్టేషన్లలో సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో కల్కా-షిమ్లా వంటి మార్గాల్లోనూ ప్రవేశపెట్టనున్నారు.

ఇతర దేశాల హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే భారత రైలు ప్రత్యేకత ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో 2-4 కోచ్‌లతో రైళ్లు నడుస్తుండగా, భారత్ 10 కోచ్‌లతో, ఒకేసారి 2,600 మంది ప్రయాణించేలా ఈ రైలును రూపొందించింది. ఇది దాని ప్రత్యేకత.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget