అన్వేషించండి

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

RRB JE 2026 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఇతర విభాగాలు ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైల్వేలో జేఈ, డీఎంఎస్ 3,993 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.
  • వయోపరిమితి 18-33 ఏళ్లు; డిప్లొమా, బీటెక్ అర్హత తప్పనిసరి.
  • సెప్టెంబర్ 13 చివరితేదీ; ఎంపిక రెండు దశల సీబీటీ ద్వారా.

RRB JE Vacancy 2026: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ హోల్డర్లకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ సహా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 3,993 పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆగస్టు 14 నుంచి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆర్‌ఆర్‌బీ జేఈ (RRB JE Posts) భర్తీ 2026 నోటిఫికేషన్‌లో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇతర సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలకు చెందినవి. మొత్తం 3,993 ఖాళీలలో కేటగిరీల వారీగా చూస్తే జనరల్ కేటగిరీలో 1,699 పోస్టులు, ఎస్సీలకు 624 పోస్టులు, ఎస్టీలకి 363 పోస్టులు, ఓబీసీకి 913 పోస్టులు కేటాయించగా.. ఈడబ్ల్యూఎస్‌కి 394 పోస్టులు ఉన్నాయి. 

ఏ పోస్టుకు ఏ అర్హత?
జూనియర్ ఇంజనీర్ పోస్టుకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి 3 సంవత్సరాల డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో BE/ B.Tech డిగ్రీ కలిగి ఉండాలి. అదే సమయంలో డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టుకు ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థి విద్యార్హతలు దరఖాస్తు చివరి తేదీ అయిన 13 సెప్టెంబర్ 2026 నాటికి పూర్తయి ఉండాలని గుర్తుంచుకోండి. చివరి సంవత్సర పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కారని స్పష్టం చేశారు.


RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

ఏజ్ లిమిట్ 18 నుంచి 33 సంవత్సరాలు 
ఆర్‌ఆర్‌బీ జేఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 1 జనవరి 2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ లిమిట్ సడలింపు లభిస్తుంది. పీడబ్ల్యూబీడీ కేటగిరీ, మాజీ సైనికులు, రైల్వే ఉద్యోగులతో సహా ఇతర కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఏజ్ లిమిట్ సడలింపు చేశారు. 

Also Read: Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

ముఖ్యమైన తేదీలివే..
ఆర్‌ఆర్‌బీ జేఈ 2026 వివరణాత్మక నోటిఫికేషన్ ఆగస్టు 13న విడుదల కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 14న ప్రారంభమయ్యాయి.  దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2026 కాగా, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. దరఖాస్తులలో దిద్దుబాట్లు (కరెక్షన్ విండో) కోసం సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 25, 2026 వరకు అవకాశం కల్పించారు. 

సిబిటి ద్వారా ఎంపిక
ఆర్‌ఆర్‌బీ జేఈ భర్తీలో అభ్యర్థుల ఎంపిక 2 దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. CBT 1, CBT 2 పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్షలు డిసెంబర్ 2026లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరీక్ష తేదీకి దాదాపు 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ వివరాలు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్‌లు విడుదల చేస్తారు. 

Frequently Asked Questions

RRB JE 2026 నోటిఫికేషన్ దేనికి సంబంధించింది?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ సహా వివిధ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ హోల్డర్లకు శుభవార్త.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు?

రైల్వే శాఖ మొత్తం 3,993 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టులు ప్రధానమైనవి.

జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టులకు విద్యార్హతలు ఏమిటి?

జూనియర్ ఇంజనీర్ పోస్టుకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/BE/B.Tech డిగ్రీ, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టుకు ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. విద్యార్హతలు సెప్టెంబర్ 13, 2026 నాటికి పూర్తయి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి ఎంత?

1 జనవరి 2027 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది?

ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 14న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13 సెప్టెంబర్ 2026. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget