అన్వేషించండి

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

Telangana Police Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వం యూనిఫామ్ సర్వీసెస్‌ ఉద్యోగార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మొత్తం ఏడు శాఖల్లో రిక్రూట్‌మెంట్‌లకు గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంచింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు రెండేళ్ల వయోసడలింపు ఇచ్చింది.
  • ఇంతకుముందు ఐదేళ్లతో కలిపి మొత్తం ఏడేళ్ల వయోపరిమితి పెరిగింది.
  • పోలీస్, ఫైర్, జైళ్లు సహా అనేక శాఖలకు సడలింపు వర్తిస్తుంది.
  • కొనసాగుతున్న, భవిష్యత్ నియామకాలకూ ఈ నిర్ణయం అమలవుతుంది.

Telangana Police Recruitment 2026 Age Limit: తెలంగాణ రాష్ట్రంలో యూనిఫామ్ ధరించి సమాజానికి సేవ చేయాలనే లక్షల మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయంతో భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నోటిఫికేషన్ల ఆలస్యం, కరోనా తదనంతర పరిణామాల వల్ల వయసు మించిపోయి ఆందోళన చెందుతున్న అభ్యర్థుల విన్నపాలను ప్రభుత్వం సానుకూలంగా మన్నించింది. ఈ క్రమంలోనే వివిధ యూనిఫామ్‌ సర్వీసెస్‌ శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని అదనంగా మరో రెండేళ్లు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో నెంబర్‌ 122 ప్రకారం రాష్ట్రంలోని ఏడు ప్రధాన యూనిఫామ్‌ శాఖల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు లభించనుంది. ఇప్పటికే మే 18, 2026 నుంచి ప్రభుత్వం ఐదేళ్ల వయోపరిమితి పెంపును అమలు చేస్తోంది. ఇప్పుడు దానికి అదనంగా మరో రెండేళ్లు జోడించడంతో అభ్యర్థులకు లభించే మొత్తం వయోసడలింపు ఏకంగా 7ఏళ్లు చేరింది. దీని వల్ల వయసు పైబడి పోటీకి దూరమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు మళ్లీ ప్రాణం పోసినట్టు అయ్యింది.

ఈ వయోపరిమితి పెంపు వర్తించే ప్రధాన శాఖలు ఏంటంటే... తెలంగాణ పోలీస్ శాఖ అయిన సివిల్ ఎస్‌ఐ కానిస్టేబుల్, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌సీ , కమ్యూనికేషన్స్‌ పోస్టులకు వర్తిస్తుంది. అగ్నిమాపక శాఖలోని ఫైర్‌మెన్‌, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు ఇది అమలు అవుతుంది. జైళ్ల శాఖ డిప్యూటీ జైలర్‌, వార్డర్‌ పోస్టుల్లో వర్తింపజేస్తారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్‌ శాఖ, రవాణా శాఖ, అటవీ శాఖలోని ఉద్యోగాలకు కూడా వర్తింపజేస్తారు. 

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ఈ వయోపరిమితి పెంపు నిర్ణయం కేవలం భవిష్యత్‌లో వచ్చే నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీస్‌ నియామక ప్రక్రియకు కూడా ఈ ఏడేళ్ల సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఇప్పటికే అప్లై చేయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి అవకాశం కల్పించే అవకాశం ఉంది. 

వయోపరిమితి లెక్కలు ఎలా మారుతాయి?

ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య కేటగిరీ అభ్యర్థులతోపాటు రిజర్వేషన్ వర్గాల వారికి కూడా గరిష్ట వయస్సు గణనీయంగా పెరిగింది. 

ఉద్యోగ హోదా బేసిక్ వయోపరిమితి పాత సడలింపు కొత్త సడలింపుతో కలిపి ఎంత కొత్త గరిష్ట అర్హత వయసు
పోలీస్ కానిస్టేబుల్‌ 22 ఏళ్లు   27 ఏళ్లు +7 ఏళ్లు 29 ఏళ్లు 
సబ్‌ఇన్స్‌పెక్టర్‌ 25 ఏళ్లు 30 ఏళ్లు +7ఏళ్లు 32 ఏళ్లు 
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ 31 ఏళ్లు 36 ఏళ్లు +7ఏళ్లు 38 ఏళ్లు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు పై పేర్కొన్న ఏడేళ్ల సడలింపుతోపాటు వారి కేటగిరీకి వర్తించే అదనపు 5 ఏళ్ల మినహాయింపు కూడా అందుబాటులో ఉంటుంది. దీని వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు కానిస్టేబుల్ పోస్టులకు గరిష్టంగా 34 ఏళ్ల వరకు, ఎస్‌ పోస్టులకు 37 ఏళ్ల వరకు పోటీ పడే అవకాశం లభిస్తుంది.                  

Frequently Asked Questions

తెలంగాణ ప్రభుత్వం యూనిఫామ్ సర్వీసెస్ వయోపరిమితిని ఎంత పెంచింది?

ప్రభుత్వం వయోపరిమితిని అదనంగా మరో రెండేళ్లు పెంచింది. దీనితో మొత్తం 7 ఏళ్ల వయోసడలింపు లభించింది.

ఈ వయోపరిమితి పెంపు ఏయే శాఖలకు వర్తిస్తుంది?

పోలీస్, అగ్నిమాపక, జైళ్ల, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లోని ఉద్యోగాలకు ఈ పెంపు వర్తిస్తుంది.

ఈ వయోపరిమితి సడలింపు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?

ఈ పెంపు భవిష్యత్ నోటిఫికేషన్లకే కాకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్ నియామక ప్రక్రియకు కూడా వర్తిస్తుంది.

రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఎలా ఉంటుంది?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 7 ఏళ్ల సడలింపుతో పాటు అదనంగా 5 ఏళ్ల మినహాయింపు లభిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget