అన్వేషించండి

Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?

Revanth Reddy BRS Aghora Puja: తెలంగాణ రాజకీయాల్లో చేతబడులు, క్షుద్రపూజల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రజా సమస్యలను పక్కనబెట్టి మూఢనమ్మకాలతో రాజకీయాలు చేయడం వల్ల సమాజానికి హాని కలిగే ప్రమాదం ఉంది.

Superstition in Telangana Politics:   తెలంగాణ రాజకీయాల్లో ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జరగాల్సిన చర్చ కాస్తా మంత్రాలు, క్షుద్రపూజలు, ఆఘోరాల వైపు మళ్లింది.  ఒకరిపై ఒకరు చేతబడులు చేయించుకుంటున్నారంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం రాజకీయ స్థాయిని దిగజార్చుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు 

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడే క్రమంలో.. బీఆర్ఎస్ నేతలు తమిళనాడు, కర్ణాటకలకు వెళ్లి ఆఘోరా పూజలు చేయించారని, వర్షాలు పడకుండా, ప్రజలు ఇబ్బందిపడి ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని క్షుద్ర పూజలు జరిపించారని ఆరోపించారు. అంతకుముందు కూడా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై  వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేశారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత నమ్మకాలతో పూజలు, యజ్ఞాలు చేసుకోవడం వేరు. కానీ,  ఎదుటివారిని నాశనం చేసేందుకు  దుష్టశక్తులను ఆవాహన చేస్తున్నారంటూ పాలకులు, విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడం నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 ప్రజల్లోని అజ్ఞానాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చడం 

తెలంగాణ సమాజంలో గ్రామీణ స్థాయిలో  చేతబడి ,  చిల్లంగి ,  క్షుద్రపూజలు  అనే మూఢనమ్మకాలు ఇప్పటికీ కొన్ని వర్గాల్లో బలంగా ఉన్నాయి. రాజకీయ నేతలు తెలిసో తెలియకో ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో ఉన్న ఈ అపోహలకు మరింత బలం చేకూరుతుంది.  ప్రభుత్వ వైఫల్యాల వల్ల వర్షాలు పడలేదా? లేక క్షుద్రపూజల వల్లేనా  అనే పిచ్చి చర్చలోకి సామాన్యులను నెట్టడం ద్వారా, నిజమైన సమస్యలైన నిరుద్యోగం, రుణమాఫీ, మౌలిక వసతుల వివాదాల నుండి ప్రజల దృష్టిని మళ్లించవచ్చనేది రాజకీయనాయకుల అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో  శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు నిరాధారమైన చేతబడి ఆరోపణలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో మూఢనమ్మకాల నెపంతో జరిగే దాడులు, దాడుల్లో అమాయకులు బలయ్యే ఘటనలు పెరిగే ముప్పు ఉంది. ఒక వైపు శాస్త్రసాంకేతిక రంగాల్లో డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న తెలంగాణకు, మరోవైపు రాజకీయ నాయకుల ఇటువంటి ప్రచారాలు ప్రతిబంధకంగా మారుతాయి.

 అభివృద్ధి రాజకీయం కనుమరుగవుతోందా? 

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా అభివృద్ధి ఫలాలు, పాలనా విధానాల ఆధారంగా ఓట్లు అడిగే సంస్కృతి కాకుండా, దుష్టశక్తులు-అదృష్టం అనే భావజాలంతో ఓటర్లను ప్రభావితం చేయాలనుకోవడం రాజకీయ పార్టీల నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం. ఎన్నికల్లో నెగ్గేందుకు భావోద్వేగాలను, భయాలను ఆసరాగా చేసుకుంటున్న పార్టీలు.. ప్రజల నిజమైన అవసరాలను పక్కన పెడుతున్నాయనడానికి ఈ సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ ఓటర్లు ఇలాంటి చౌకబారు ప్రచారాలను, మూఢనమ్మకాల రాజకీయాలను ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకులు చేస్తున్న అభివృద్ధి, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజాసమస్యలపైనే చర్చ జరగాలి తప్ప, ఈ చేతబడులు - ఆఘోరాల ఆరోపణలతో ప్రజాస్వామ్య వ్యవస్థను పల్చన చేయకూడదు. నేతలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సమాజాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని అంటున్నారు.  


 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget