అన్వేషించండి

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

NDA Convenor Chandrababu?: కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో సమన్వయాన్ని పెంచేందుకు కొత్త కన్వీనర్‌ నియామకానికి ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ రేసులో చంద్రబాబు, నితీష్‌ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్డీఏలో సమర్థ పాలన, సామరస్యం కోసం కన్వీనర్ వ్యవస్థ పునరుద్ధరణ.
  • బిజెపికి మెజారిటీ లేనందున మిత్రపక్షాల సమన్వయం అవశ్యకమని భావిస్తున్నారు.
  • చంద్రబాబు, నితీష్ కుమార్ పేర్లు కన్వీనర్ పదవికి ప్రధానంగా పరిశీలనలో.
  • మిత్రపక్షాల మధ్య విభేదాలు పరిష్కరించి, పాలన సులువు చేయడమే విధి.

NDA Convenor Chandrababu?: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేషనల్‌ డెమొక్రటిక్‌ అలైన్స్‌ ప్రభుత్వం, పాలనను మరింత సమర్థవంతంగా, మిత్రపక్షాల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకుండా నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా  గతంలో ఎన్డీఏ ఉన్న కన్వీనర్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించి, గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. 

2024లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ను దాటలేకపోయింది. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం 293 మంది ఎంపీల మద్దతుతో నడుస్తోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ 16 సీట్లు, జనతాదళ్‌ యునైడెట్‌12 సీట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

గత పదేళ్లలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండటంతో నిర్ణయాలన్నీ ఏకపక్షంగా సాగాయి. కానీ ఇప్పుడు సమ్మతి రాజకీయాల కాలం నడుస్తోంది. మిత్ర పక్షాల డిమాండ్లు, రాష్ట్రాల ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వ విధానాల మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండేలా చూడటమే ఈ కన్వీనర్‌ నియామకం వెనుక ఉన్న ఉద్దేశం. 

అత్యున్నత బాధ్యతాయుతమైన పదవికి ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో మొదటి పేరు చంద్రబాబు నాయుడు. దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు జాతీయ స్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్ ఫ్రంట్‌ వంటి కూటములను నడిపించిన చారిత్రక అనుభవం ఆయన సొంతం. దక్షిణాది, ఉత్తరాది పార్టీలతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు కూటమికి అదనపు బలం ఇస్తాయని బీజేపీ భావిస్తోంది. 

రెండో పేరు నితీష్ కుమార్. హిందీ హార్ట్‌లాండ్‌గా పిలిచే  ఉత్తర భారత్‌ రాజకీయాల్లో నితీష్ కుమార్ మాస్టర్ మైండ్‌. బిహార్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం, ఇతర ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేయగల నైపుణ్యం ఆయనకు ఉన్నాయి. ప్రధాని మోదీతో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం. 

ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు

ఢిల్లీలో త్వరలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మెగా సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందున, ఈ సమావేశంలోనే అధికారికంగా కన్వీనర్‌ పేరును ప్రకటించే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి.

విధులు, అధికారులు ఎలా ఉంటాయి ?

ఎన్డీయే కన్వీనర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి కేవలం ఒక ప్రతినిధి మాత్రమేకాదు. కూటమిలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే వారధిగా వ్యవహరిస్తారు. మిత్రపక్షాల మధ్య  వచ్చే చిన్నపాటి విభేదాలను చర్చల ద్వారా ప్రాథమిక దశలోనే పరిష్కరించాలి. ఉభయ సభల్లో బిల్లులు పాస్ చేసే సమయంలో భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే మాటపై ఉండేలా చూడాలి. వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటును సజావుగా పూర్తి చేయడం వీరి విధి. 

రాష్ట్రాల అభివృద్ధికి కన్వీనర్‌ ప్రాముఖ్యత

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఈ పదవి చాలా కీలకం కానుంది. రాష్ట్రాల్లోని సమస్యలై నేరుగా కేంద్రమంత్రులు, హోంమంత్రితో చర్చించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.    

Frequently Asked Questions

ఎన్డీఏ కన్వీనర్ వ్యవస్థను ఎందుకు పునరుద్ధరిస్తున్నారు?

బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాల మధ్య సమన్వయం, వారి డిమాండ్లు, రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్ర విధానాలతో అనుసంధానించడానికి ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు.

కన్వీనర్ పదవికి ప్రధానంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి?

చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిద్దరికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం, జాతీయ స్థాయిలో సమన్వయ నైపుణ్యాలు ఉన్నాయి.

ఎన్డీఏ కన్వీనర్ విధులు, అధికారాలు ఏమిటి?

కన్వీనర్ కూటమిలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే వారధిగా వ్యవహరిస్తారు. మిత్రపక్షాల విభేదాలను పరిష్కరించడం, బిల్లుల ఆమోదం, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వీరి ప్రధాన విధులు.

కన్వీనర్ పేరును ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది?

ప్రధాని మోదీ ఇప్పటికే ఆమోదం తెలిపినందున, ఢిల్లీలో త్వరలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మెగా సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP TDP Janasena Social Media War: ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?
ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Embed widget