అన్వేషించండి

AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

AP DSC vs Group 1 Scam: డీఎస్సీ ఆరోపణలకు చెక్ పెడుతూ గ్రూప్-1 సిట్ రిపోర్ట్‌తో రివర్స్ అటాక్! 97% ఓఎంఆర్ షీట్లలో వైట్ నర్, మార్కుల మార్పిడి జరిగిందని తేలడంతో కలకలం రేగుతోంది.

AP High Court Group 1 Case:  కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ జరిగింది అంటూ వైఎస్‌ఆర్‌సీపీ గత కొంతకాలంగా ఉద్యమం  చేస్తోంది.  అయితే, ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించడంలో వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా విఫలమవడంతో ఆ నిరసనలకు పొలిటికల్ మైలేజ్ దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.  కానీ, అదే సమయంలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకనంలో ఘోరమైన అక్రమాలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం  హైకోర్టుకు నివేదిక సమర్పించడం ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ మార్చేసింది. డీఎస్సీపై ఎలాంటి క్లూస్ ఇవ్వలేకపోయిన వైఎస్‌ఆర్‌సీపీకి, గ్రూప్-1 కేసు రూపంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత పవర్ ఫుల్ ఆయుధం దొరికినట్లయింది.

సిట్ రిపోర్టులో సంచలన విషయాలు

సిట్ దాఖలు చేసిన తాజా నివేదిక ఆధారంగా పరిశీలిస్తే.. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో వ్యవస్థాగతంగా తీవ్రమైన అవకతవకలు జరిగాయని పక్కా నిరూపణలతో సహా బయటపడింది. డిజిటల్ మూల్యాంకనం రద్దు కావడం, హాయ్‌లాండ్ రిసార్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలు తరలించడం, ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పులపై సరిదిద్దడం వరకు చోటుచేసుకున్న తీరు షాకింగ్‌గా ఉంది. ల్యాబ్ ఫొరెన్సిక్ రిపోర్టుల ప్రకారం తనిఖీ చేసిన 736 వాల్యుయేషన్ రికార్డుల్లో ఏకంగా 718 రికార్డులలోఅంటే 97.55 శాతం  దిద్దుబాట్లు, ఓవర్‌ రైటింగ్‌లు జరిగాయని తేలడం నాటి వ్యవహారం ఎంత దారుణంగా సాగిందో తెలియజేస్తోంది.

సీతారామంజనేయులు పాత్ర కీలకం

ఈ మొత్తం వ్యవహారంలో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి పి.ఎస్.ఆర్. ఆంజనేయులు  పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనుమతి లేకుండానే జవాబు పత్రాలను హాయ్‌లాండ్ రిసార్ట్‌కు తరలించి, 84 రోజుల పాటు ప్రైవేట్ ఏజెన్సీ  క్యామ్‌సైన్ మీడియా  కస్టడీలో ఉంచడం వెనుక ఆయనే కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. దాదాపు రూ.1.14 కోట్ల ప్రజాధనాన్ని సదరు ఏజెన్సీకి అప్పగించి, కేవలం ముందస్తు డిజిటల్ మార్కులను మళ్లీ OMR రికార్డుల్లో ఎంట్రీ చేయించేలా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇప్పించారనే ఆరోపణలు నాడు ఐపీఎస్ అధికారి హోదాలో ఆయన నడిపిన నెట్‌వర్క్‌ను ఎండగడుతున్నాయి.  హైకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని చెప్తూనే.. నిబంధనలకు విరుద్ధంగా వైట్‌నర్   వాడటం, సీనియర్ ఎగ్జామినర్ల సంతకాలు లేకపోవడం, కొత్త సంతకాలు కలవకపోవడం, 197 మందికి మార్కులు పెంచి, 222 మందికి మార్కులు తగ్గించడం వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. సీఎస్ ఆప్షన్ లేని చోట నాటి వైఎస్‌ఆర్‌సీపీ పెద్దల ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆధారంగానే మార్కులు మార్చారని సిట్ రిపోర్ట్ తేల్చిచెప్పడం గేమ్ ఛేంజర్‌గా మారుతోంది. 

ప్రస్తుతం సర్వీసులో ఉన్న గ్రూప్ వన్ అధికారులు

ప్రస్తుతం సర్వీసులో ఉన్న గ్రూప్-1 అధికారులను గనుక సిట్ లోతుగా ప్రశ్నిస్తే మరింత సంచలన విషయాలు బయటకు రావడం ఖాయం. నాటి మూల్యాంకనంలో అసలైన మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేసి, ఎవరెవరికి మార్కులు పెంచి కొలువులు కట్టబెట్టారో లబ్ధిదారులైన అధికారుల మూలాల నుంచి వెలికితీసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.   డీఎస్సీ పరీక్షలపై ఆధారాలు లేని ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసిన వైఎస్‌ఆర్‌సీపీ.. ఇప్పుడు గ్రూప్-1 సిట్ నివేదికతో తామే ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందే నిరుద్యోగ ఓట్ బ్యాంకును ఆకట్టుకోవడానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రయత్నించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాటి గ్రూప్-1 స్కామ్‌ను ఎండగడుతూ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. ఆధారాలతో సహా ఫోరెన్సిక్ రిపోర్టులు కోర్టుకు చేరడంతో, పిఎస్ఆర్ ఆంజనేయులు సహా ఈ కుంభకోణంలో ప్రమేయమున్న కీలక సూత్రధారులపై చట్టపరమైన ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget