Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ 2026కు సంబంధించి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బీసీసీఐ సీఓఈ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఆసియా గేమ్స్ నుంచి విశ్రాంతి కల్పించారు. రాబోయే వెస్టిండీస్ వైట్‌బాల్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకునే గంభీర్‌తో పాటు ఆయన సపోర్ట్ స్టాఫ్‌కు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
లక్ష్మణ్‌కు మేన్స్ టీమ్ కు హెడ్ కోచ్ అయితే.. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు. గతంలో జింబాబ్వే సిరీస్‌లోనూ లక్ష్మణ్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, 2022 చైనా ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి.
మరోవైపు జపాన్‌లో జరగనున్న ఆసియా గేమ్స్‌లో క్రికెట్ జట్ల వసతి ఏర్పాట్లపై వివాదం నెలకొంది. ఆటగాళ్లకు సరైన డ్రెస్సింగ్ రూమ్‌లు, వాష్ రూమ్స్ లేవంటూ బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో నవోకి అలెక్స్ మియాజీ స్పందిస్తూ.. గదుల కొరత ఉన్నప్పటికీ పాల్గొనే జట్లకు హోటల్ వసతి కల్పిస్తున్నామని, జట్లు కోరుకుంటే సొంతంగా వసతి ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉందని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















