అన్వేషించండి

KCR Assembly Attendance: సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతారు! — కేటీఆర్ ప్రకటన వెనుక ఆత్మవిశ్వాసమా? కాంగ్రెస్‌కు దొరికిన పొలిటికల్ అస్త్రామా?

Revanth Reddy vs KCR: కేసీఆర్ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతారని కేటీఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం. ప్రతిపక్ష హోదాను పక్కనపెట్టి పదవి కోసం చూస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

BRS Congress War:   తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారీ కేసీఆర్ రాకపై ఉత్కంఠ నెలకొనడం, చివరకు ఆయన రాకపోవడం కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తూనే ఉంది. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని సరికొత్త మలుపు తిప్పాయి.  కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతారు అంటూ కేటీఆర్ చేసిన కుండబద్దలు కొట్టిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. 2023 ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు, అడపాదడపా గవర్నర్ ప్రసంగం సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే వచ్చి వెళ్లిపోతున్నారు.   అసలు సభకు రాబోరని కేటీఆర్ స్వయంగా స్పష్టం చేయడం ఒకరకంగా కాంగ్రెస్ విమర్శలను ధ్రువీకరించినట్లే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసెంబ్లీకి రాకపోవడాల వెనుక బలమైన రాజకీయ కారణాలు 

సాధారణంగా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లేదా తెలుగు నేల రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నాయకులు ఇలాంటి ప్రతిజ్ఞలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ మొదలుకుని చంద్రబాబు నాయుడు, జయలలిత వరకు పలువురు నేతలు అధికార పక్షం నుంచి ఎదురైన తీవ్రమైన అవమానాలు, దాడులు లేదా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిన ఉదంతాలతో  తీవ్ర భావోద్వేగంతో సీఎంగానే తిరిగి ఈ సభలో అడుగుపెడతాను  అంటూ సవాల్ విసిరారు. అక్కడ ప్రజలకు ఆ నేతలపై ఒక రకమైన సానుభూతి, వారు అనుభవించిన మానసిక వేదన కనపడ్డాయి. కానీ కేసీఆర్ విషయంలో అసెంబ్లీలో అలాంటి అవమానకర ఘటనలేమీ జరగలేదు. కేసీఆర్ స్వయంగా అలాంటి శపథం చేయలేదు. కేవలం కేటీఆర్ మీడియా సమావేశంలో  డా సాధారణ అంశంగా ఈ వ్యాఖ్య చేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ వాదన ప్రజల్ని మెప్పిస్తుందా? 

ఈ ధోరణి క్షేత్రస్థాయి ప్రజలను, పార్టీ క్యాడర్‌ను మెప్పిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. ప్రతిపక్ష నాయకుడి హోదా  అనేది కేవలం ఒక గౌరవ ప్రదమైన హోదా మాత్రమే కాదు. అది రాజ్యాంగబద్ధమైన, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన గురుతర బాధ్యత. రైతు సమస్యలు, పంట రుణాలు, నిరుద్యోగం, హామీల అమలు వంటి కీలక అంశాలపై సభలో ప్రభుత్వాన్ని కడిగిపారేయాల్సిన బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత సభకే రానని తేల్చిచెబితే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీకి రాని నేత, కేవలం ‘ముఖ్యమంత్రి పదవి’ ఉంటేనే వస్తారా అన్న ప్రశ్న సామాన్యుల్లో రేకెత్తే అవకాశాన్ని కేటీఆర్ తమ ప్రకటన ద్వారా కల్పించారు.

కేసీఆర్‌పై ఎదురుదాడికి మంచి అవకాశం

ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్‌కు అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతూ, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేస్తున్నారు.  కేసీఆర్‌కు ప్రజల సమస్యలు పట్టవు.. ఆయనకు అధికార దాహం, సీఎం కుర్చీ తప్ప మరో ఆలోచన లేదు. అధికారం ఉంటేనే సభకు వస్తారు, లేకపోతే ప్రజలను గాల్లోకి వదిలేస్తారు  అంటూ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెడితే, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం బీఆర్‌ఎస్‌కు కత్తిమీద సామే అవుతుంది. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్ నుంచే రాజకీయాలు నడుపుతున్నారన్న విమర్శలకు కేటీఆర్ మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. కే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఉద్యమ నేతను సభలో అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ఆ అనైతిక వేదికపైకి కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ లేకపోయినా కేటీఆర్, హరీష్ రావు లాంటి సీనియర్లు సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని, కేసీఆర్ నేరుగా ప్రజల్లోకే వస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

కేసీఆర్ గైర్హాజరీని ప్రజలు సమర్థిస్తారా?

ఈ సమర్థనలు మేధావులను, తటస్థ ఓటర్లను ఎంతవరకు ఒప్పిస్తాయన్నది అనుమానమే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడటం ఎంత ముఖ్యమో, ఓడిపోయినప్పుడు ప్రతిపక్ష గొంతుకగా అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోవడం అంతే ముఖ్యం. కేసీఆర్ రాకపై సాగుతున్న ఈ రచ్చలో బీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడటమే కాకుండా, రేవంత్ రెడ్డికి రాజకీయంగా పైచేయి సాధించే అవకాశాన్ని ఇచ్చినట్లయింది. భవిష్యత్తులో ఈ  సీఎంగానే వస్తారు  అనే నినాదం బీఆర్‌ఎస్‌కు ఓట్ల రూపంలో లాభిస్తుందా లేక ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.


  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
Tamil Nadu CM Vijay TVK MLAs Controversy: సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget