అన్వేషించండి

Vangaveeti Radha: బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?

Vijayawada Mayor Elections: విజయవాడ మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్! వంగవీటి రాధాను బరిలోకి దించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

VMC Mayor Direct Elections:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుండెకాయ వంటి విజయవాడ నగరంలో ఊహించని రాజకీయ పరిణామాలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడే సూచనలు కనిపిస్తుండటంతో అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో కదలిక మొదలైంది. ఈ తరుణంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి వంగవీటి మోహన రంగా తనయుడు, సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణకు ప్రత్యేక పిలుపు రావడం బెజవాడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం చంద్రబాబుతో రాధా త్వరలోనే భేటీ కానున్నారన్న వార్త విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది.

 ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయం.. మారిన లెక్కలు! 

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకు ఈసారి కౌన్సిలర్లు కాకుండా, ప్రజలే నేరుగా ఓటు వేసి మేయర్లను ఎన్నుకునే  ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి ని ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. విజయవాడ నగర కార్పొరేషన్ భౌగోళికంగా తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. అంటే, ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌గా పోటీ చేయడమంటే దాదాపు మూడు అసెంబ్లీ స్థానాల విస్తీర్ణంలో, లక్షలాది మంది ఓటర్లను నేరుగా ఎదుర్కోవాల్సి రావడం. ఇంతటి విస్తృతమైన పరిధిలో కేవలం పార్టీ గుర్తు మాత్రమే సరిపోదని, నగరం మొత్తాన్ని ప్రభావితం చేయగల బలమైన ప్రజాదరణ, మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిని బరిలోకి దించితేనే విజయం నల్లేరుపై నడక అవుతుందని టీడీపీ అగ్రనాయకత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

 వంగవీటి రాధాకృష్ణ ఎందుకు కీలకం? 

విజయవాడ నగర సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో వంగవీటి కుటుంబానికి తరగని అభిమాన గణం ఉంది.  రంగా పేరు వింటే నేటికీ బెజవాడలో ఒక ప్రత్యేకమైన ఉద్వేగం కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర దిగువ, మధ్యతరగతి ప్రజల్లోనూ, యువతలోనూ రాధాకు మంచి ఆదరణ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, అప్పట్లో సీట్ల సర్దుబాటు వల్ల రాధాకు ప్రత్యక్షంగా టికెట్ లభించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆయన ఎలాంటి పదవినీ ఆశించలేదు. ఇప్పుడు స్వయంగా మూడు నియోజకవర్గాల సమానమైన మేయర్ పీఠానికి ఆయనను బరిలో దింపడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించకుండానే సరైన గౌరవం ఇచ్చినట్లవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

 రాధా నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ! 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరగబోయే కీలక భేటీలో ప్రధానంగా మేయర్ అభ్యర్థిత్వం గురించే చర్చించనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యక్షంగా మేయర్ రేసులో నిలబడేందుకు రాధా సిద్ధంగా ఉన్నారా లేదా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది చంద్రబాబు నేరుగా తెలుసుకోనున్నారు. ఒకవేళ రాధా నేరుగా పోటీకి విముఖత చూపితే, ఆయన కుటుంబానికి చెందిన వారిని బరిలోకి దింపి, రాధాకు త్వరలోనే ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత కార్పొరేషన్ పదవి ఇచ్చే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై కూడా చర్చ జరుగుతోందని టాక్. ఒకవేళ చంద్రబాబు ప్రతిపాదనకు రాధా గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీ ఖాయమని అనుకోవచ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
YS Jagan Sharmila Dispute: కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
కుటుంబ రగడతో దెబ్బతింటున్న పొలిటికల్ ఇమేజ్ - మేనకోడలి పెళ్లి వేదిక వివాదాన్ని జగన్ పెద్దది చేసుకున్నారా?
Telangana BJP Strategy: తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
తెలంగాణలో కమలదళం బిగ్ ప్లాన్ - మోదీ, అమిత్ షా పర్యటనలతో అసంబ్లీ పోరుకు బీజేపీ సిద్ధం!
Advertisement

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget