వెయిట్ ఈజ్ ఆల్మోస్ ఓవర్.. త్వరలోనే బిగ్ అప్డేట్
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Telangana Top News | తన రాజకీయ భవితవ్యంపై త్వరలోనే బిగ్ అప్డేట్ ఇస్తానని తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

- కొండా సురేఖ మంత్రివర్గం నుండి తొలగించబడగా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- క్రమశిక్షణా కమిటీ నివేదిక ఆధారంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
- కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం అన్యాయమని ఆమె పేర్కొంది.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు లేకపోవడంపై సురేఖ నిలదీసింది.
Konda Surekha Politics | హైదరాబాద్: బిగ్ అప్‌డేట్ ప్రకటన ఉంటుందన్న సోషల్ మీడియా పోస్టుపై కొండా సురేఖ స్పందించారు. సోషల్ మీడియా పేజీల్లో తన పేరుతో పోస్టులు వైరల్ అవుతున్నాయని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అధికారిక ఖాతా ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు.
అసలేం జరిగిందంటే..
తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అని క్యాప్షన్‌తో కొండా సురేఖ ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. త్వరలో బిగ్ అప్డేడ్ వస్తుందని, తెలంగాణ ప్రజలు ఈ విషయం గమనించాలంటూ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.
గురువారం నాడు తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్‌కు సీఎంఓ నుంచి లేఖ పంపిచారు. కొన్ని గంటల్లోనే ఆ లేఖ ఆమోదించడంతో కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అయితే తనపై కుట్ర జరుగుతోందని, తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదని, ఇది అన్యాయమని ఆమె వ్యాఖ్యానించారు.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై అసంతృప్తి
తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై గురువారం నాడు కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు మరో అవకాశం ఇస్తుందని, ఎలాంటి కఠిన నిర్ణయాలు ఉండవని మొదట ఆమె భావించారు. కానీ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, జి చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని తెలంగాణ కాంగ్రెస్‌కు సూచించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వీరిని పదవుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెస్ అధిష్ఠానం తన వివరణ తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. తన కుమార్తె సుస్మిత ఒక స్వతంత్ర మహిళ అని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుబట్టే అధికారం తనకు లేదన్నారు. తనతో పాటు చాలా మంది తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పార్టీ నేతలపై జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుందో చెప్పాలని నిలదీశారు.
తనపై కక్షపూరితంగానే చర్యలు తీసుకుంటూ బీసీని, మహిళా మంత్రిని పదవి నుంచి తప్పించారని కొండా సురేఖ పేర్కొన్నారు. తన కారణంతో ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. తన అంశం కారణంగా చిన్నారెడ్డిపై వేటు వేయడం సరికాదన్నారు. రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదు కనుక.. ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లపాటు సీఎం తానేనని, అధిష్టానాన్ని ధిక్కరిస్తూ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తాను రేవంత్‌ను ఎక్కువగా అభిమానించానని, కానీ ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Before You Go
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Frequently Asked Questions
కొండా సురేఖ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఏమిటి?
కొండా సురేఖను మంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారు?
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నివేదిక, కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ఆమెను తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు లేఖ పంపడంతో ఆమె పదవి కోల్పోయారు.
తనను మంత్రి పదవి నుండి తొలగించడంపై కొండా సురేఖ ఏమని స్పందించారు?
తనపై కుట్ర జరిగిందని, వివరణ తీసుకోకుండా అన్యాయం చేశారని ఆమె అన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























