అన్వేషించండి

Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

Konda Surekha Dismissal Comments : మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని.. ఎమ్మెల్యేగా ఉంటానన్నారు.

Revanth Reddy Konda Surekha Controversy:   తెలంగాణ కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల లక్ష్యంగా విమర్శల బాణాలు సంధించారు. తనకు కనీసం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస ముగింపు వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా బర్తరఫ్ చేయడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు. ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటూ ఎదిగిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా కుట్రపూరితంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ,  నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను  అని తనకు తానే ప్రకటించుకోవడం, ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం మోనోపోలీ పరిపాలనకు నిదర్శనమని మండిపడ్డారు. బిసి మహిళనైన తనను పదవి నుంచి తొలగించిన తీరుపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలంతా ఏకమై తనపై కక్షగట్టి బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో బర్తరఫ్ చేయించారని ఆరోపించారు. మల్లు రవి, రోశయ్యల నుంచి నేటి అగ్రనేతల వరకు గతంలో పార్టీని, ఇందిరాగాంధీని విమర్శించిన వారిని పక్కనబెట్టి, తనపై మాత్రం కఠినంగా వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహాన్ని ప్రశ్నించారు.

సొంత ప్రభుత్వం మరియు కేబినెట్ వాతావరణంపై సురేఖ సంచలన విషయాలను బయటపెట్టారు. "ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి కూడా సంతోషంగా లేరు. మంత్రులంతా గుండెపై చేయి వేసుకుని నిజం చెప్పాలి. పనులు కావాలంటే ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పక్షపాత వాతావరణం నెలకొంది" అని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ధైర్యంగా బయటకు వచ్చి ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలపై గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నాకు జరిగిన అన్యాయమే రేపు మీకు కూడా జరుగుతుందని, ఇప్పటికైనా మౌనం వీడకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.

తమ మాజీ ఓఎస్‌డీ సుమంత్ వ్యవహారంపై స్పందిస్తూ.. సుమంత్ పేరు చెప్పుకుని కిరణ్ అనే వ్యక్తి అక్రమ వసూళ్లకు పాల్పడితే, ఆ నెపాన్ని కావాలని సుమంత్‌పై నెట్టి సిసిఎస్ కేసు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తమ అనుచరులను, కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బంది పెట్టే రాజకీయాలు చరిత్రలో ఎక్కడా లేవని వాపోయారు. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని తనను లక్ష్యంగా చేసుకున్నారని, తన భర్త కొండా మురళిని కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పి అవమానించారని ఆవేదన చెందారు. ప్రజాదరణతో పైకి వచ్చిన తమకు నియోజకవర్గ ప్రజలే జవాబుదారీ అని స్పష్టం చేశారు.

 ముఖ్యమంత్రికి , పార్టీ అధిష్టానానికి ఒక ముఖ్యమైన హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ప్రజాభిప్రాయంపై తక్షణమే సర్వే చేయించాలని సూచించారు.  తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, కేవలం ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని విలేకరుల సమావేశంలో విడుదల చేసిన లేఖ ద్వారా స్పష్టత ఇచ్చారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Jayesh Ranjan IAS to opts VRS | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Jayesh Ranjan | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget