అన్వేషించండి

MP Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

MP Asaduddin Owaisi: 'సీఎం సాబ్ మీ పాత దూకుడు చూపించండి, ప్రజల్లోకి రండి' అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేసీఆర్‌కు గతంలో రేవంత్ రెడ్డి గురించి ఓవైసీ హెచ్చరికలు జారీ చేశారు.
  • రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి ఓవైసీ మద్దతు తెలిపారు.
  • సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీని పొగిడారు, దేశ వ్యతిరేక ప్రచారాన్ని ఖండించారు.
  • పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కమిషనర్‌ను ఆదేశించారు.

MP Asaduddin Owaisi: "కేసీఆర్‌కు ముందే చెప్పాను. రేవంత్‌ రెడ్డిని ఆపకపోతే మీరు ఇంట్లో కూర్చోవాల్సిందే” అని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సైదాబాద్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాము గతంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చామని, అది నిజం అన్నారు. కానీ తాను పదే పదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు  కూడా చెబుతూనే ఉండేవాడినన్నారు. రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోండి.. లేకపోతే మీరంతా ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తుందని చెప్తుండేవాడనన్నారు. 

పాత దూకుడు చూపించండి 

 "ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే... సీఎం సాబ్, మీరు కాస్త మరీ ఎక్కువ మర్యాదస్తుడిగామారిపోయారు. కాస్త మీ పాత దూకుడు చూపించండి, ప్రజల్లోకి రండి. మిమ్మల్ని ఏ విషయం ఆపుతోందో నాకైతే అర్థం కావడం లేదు. హనుమంతరావు సాబ్, మీరేమైనా చెబుతారా వచ్చి? నేను చెప్పింది తప్పు కాదు కదా? మీరు కూడా నాతో ఏకీభవిస్తున్నారు కదా... మీరు ఒప్పుకుంటున్నారు... మీరొక సీనియర్ నాయకులు, మీరే ఒప్పుకున్నారంటే ఇక అంతే, నేను సరైన మాటే చెప్పాను.  సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, యావత్ తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ ప్రగతి సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము" అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.   

తాను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నానని, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి చెందుతున్నాయ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీ స్టైల్‌లో మీరు పరిపాల‌న చేయండి.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ప్రత్యేకంగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు.  

Also Read: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సమాచారం లీక్.. కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు

ఎంఐఎం దేశానికి వ్యతిరేకం కాదు -సీఎం రేవంత్ రెడ్డి

అనంతరం ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ప్రశంసలు కురిపించారు. దేశభక్తి విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓవైసీ ఏమీ తక్కువ కాదన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమనే ప్రచారం కేవలం కొందరి దుష్ప్రచారం మాత్రమేనన్నారు. సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. అసదుద్దీన్‌ ఓవైసీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలతో కలిసి పాతబస్తీ అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. గతంలో ఎంతమంది సీఎంలు ఓల్డ్ సిటీకి వచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పాతబస్తీ అభివృద్ధికి అసదుద్దీన్ ఓవైసీ ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా పరిశీలించి నిధులు మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు.

Also Read: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం

Frequently Asked Questions

కేసీఆర్‌కు ఓవైసీ గతంలో ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?

రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోకపోతే, మీరు ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని ఓవైసీ కేసీఆర్‌కు గతంలో హెచ్చరించారు. తాము గతంలో బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని కూడా ఆయన చెప్పారు.

అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి మద్దతు ఇస్తున్నారు, పార్టీకా లేక వ్యక్తికా?

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు.

ఎంఐఎంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు?

ఎంఐఎం దేశానికి వ్యతిరేకం కాదని, ఓవైసీ దేశభక్తిలో ప్రధాని మోదీకి ఏమాత్రం తక్కువ కాదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఎంఐఎంపై జరిగే ప్రచారం దుష్ప్రచారం మాత్రమేనన్నారు.

పాతబస్తీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నారు?

పాతబస్తీ అభివృద్ధికి అసదుద్దీన్ ఓవైసీ ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా పరిశీలించి నిధులు మంజూరు చేయాలని సీఎం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ఆయన ఓవైసీ సోదరులతో పాతబస్తీ అభివృద్ధిపై చర్చించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Harish Rao: పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు
పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు
Kamble Mukesh Kumar: కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన
కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Embed widget