అన్వేషించండి

Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం

Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. మంగళసూత్రం చోరీ విషయంలో టీడీపీ, వైసీపీ నిరసనలతో దుమారం రేగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చోరీపై వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ దుమారం, ఉద్రిక్తత.

Pedakakani Temple Issue: గుంటూరు జిల్లా పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం దగ్గర హై-టెన్షన్ వాతావరణం నెలకొంది. అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. అమ్మవారి మంగళసూత్రం చోరీపై వైసీపీ నేత అంబటి మురళి శాంతి కల్యాణం నిర్వహించాలని తలపెట్టారు. కాసేపట్లో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ నాంతాడు కానుకగా సమర్పించనున్నారు. ఈ క్రమంలో పెదకాకాని వస్తున్న వైసీపీ నేత మల్లాది విష్ణు కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇప్పటికే చోరీ చేసిన అర్చకుడు రణధీర్‌ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వ్యక్తి నిందితుడు కాదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంబటి మురళీకృష్ణ ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీశారని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. దీంతో ఆలయం వద్దకు భారీగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పెదకాకానిలో భారీగా పోలీసులను మోహరించారు.  

ఆలయంపై కుట్ర చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చోరీ చేసిన రణధీర్ ను వైసీపీ హయాంలోనే తాత్కాలిక అర్చకుడిగా నియమితులయ్యారని అంటున్నారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేస్తున్నారు.   

Also Read: AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!

అసలేం జరిగిదంటే? 

గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు కొండవీటి రణధీర్‌ మంగళసూత్రం చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 14న శ్రావణమాసం సందర్భంగా అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రెండు రోజుల పాటూ భక్తుల దర్శనం కోసం ఈ అలంకరణను ఉంచారు. ఆగస్టు 18న అమ్మవారి మంగళసూత్రం మాయమైనట్లు అర్చకులు, ఈవో గుర్తించారు. 

అమ్మవారి మంగళసూత్రం చోరీ కేసు దర్యాప్తుల్లో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ సమయంలోనే అర్చకుడు రణధీర్‌ను ప్రశ్నించగా, తనకేమీ తెలియదని చెప్పాడని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. రణధీర్‌ ఇంట్లోని బెడ్‌రూమ్‌లో పోలీసులు తనిఖీలు చేయగా, మంగళసూత్రం దొరికిందన్నారు. రణధీర్ తల్లిని ప్రశ్నించగా, తన కుమారుడు కొప్పురావూరు ఆలయం నుంచి తెచ్చాడని, నకిలీ బంగారమని సమాధానం ఇచ్చిందన్నారు.  

రణధీర్‌ను పోలీసులు ప్రశ్నించగా, అమ్మవారి మంగళసూత్రాన్ని చోరీ చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. రణధీర్‌ అమ్మవారి మంగళసూత్రం చోరీ చేసిన తర్వాత ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు షోరూం వ్యక్తితో మాట్లాడినట్లు డీఎస్పీ తెలిపారు. బంగారం షాపు నిర్వాహకుడిని ఫోన్‌లో సంప్రదించాడని. దర్యాప్తులో తేలింది. అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనపై వైసీపీ నిరసనలు చేపట్టింది. 

Also Read: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు

Frequently Asked Questions

మంగళసూత్రం ఎప్పుడు మాయమైనట్లు గుర్తించారు?

ఆగస్టు 14న అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆగస్టు 18న అమ్మవారి మంగళసూత్రం మాయమైనట్లు అర్చకులు, ఈవో గుర్తించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget