Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్
గుండెనిండా గుడిగంటలు' సీరియల్ అత్యంత ఆసక్తికరమైన మలుపులతో సాగుతోంది. బాలును అవమానించిన సంజీవ్‌కు బుద్ధి చెప్పేందుకు మీనా, శృతిలతో కలిసి వేసిన పొలిటికల్ ప్లాన్ పక్కాగా వర్క్ అవుట్ అవుతుంది. సంజీవ్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేలా వీడియో చేసి బెదిరించడంతో, నీలకంఠం మరియు సంజీవ్ దిగొచ్చారు.
నేరుగా బాలు ఇంటికి వచ్చి సంజీవ్, బాలుకు క్షమాపణలు చెప్పాడు. మౌనికను ఇంటికి తీసుకొచ్చి, బాలు చేతికి రాఖీ కట్టించడమే కాకుండా మీనా కండిషన్ ప్రకారం తన చేతులతోనే చెల్లెలికి చీరను బహుమతిగా ఇప్పించాడు. దీంతో ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ప్రభావతి, నీలకంఠానికి రాఖీ కట్టగా, అతడు తన బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్లాడు. భర్త అవమానాన్ని తట్టుకోలేక మీనా వేసిన ఈ రివర్స్ స్కెచ్ చూసి బాలు ఆమెపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను మరింత పెంచుకున్నాడు. మీనా వీడియో ప్లాన్ వివరిస్తుంటే బాలు ఆశ్చర్యపోయాడు.
ఇక మరుసటి రోజు కథలో మరో ఆసక్తికర మలుపు తిరిగింది. సత్యానికి అతడి తల్లి సుశీలమ్మ ఫోన్ చేసి శ్రావణమాసం సందర్భంగా ఇంట్లో అందరూ కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని చెప్తుంది. పూజ ఏర్పాట్ల బాధ్యతను మీనాకు అప్పగించింది. అయితే ప్రభావతి మాత్రం తన కోపాన్ని తగ్గించుకోకుండా మాట్లాడటంతో సుశీలమ్మ గట్టిగానే చురకలు అంటించింది. దీంతో ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ప్రశాంతంగా జరుగుతుందా లేదా ప్రభావతి, రోహిణిలు మళ్లీ ఏమైనా కొత్త గొడవలు సృష్టిస్తారా అనేది రాబోయే ఎపిసోడ్లో ఉత్కంఠగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















