సంస్థ పన్నులు ఎగవేసి, గోదావరి నదిని తీవ్రంగా కలుషితం చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. స్థానిక సంస్థలకు దాదాపు రూ. 21.34 కోట్లు పన్నులు చెల్లించలేదని తెలిపారు.
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Andhra Pradesh Top News | ఆంధ్రా పేపర్స్ పరిశ్రమ రూ.21.34 కోట్ల పన్నులు ఎగ్గొడుతూ, గోదావరిని కలుషితం చేస్తోందని, కోర్టులకు వెళ్లి కాలయాపన చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

- పవన్ కళ్యాణ్ ఆంధ్రా పేపర్స్ పన్ను ఎగవేత, కాలుష్యంపై ధ్వజం.
- పరిశ్రమ 3.5 కోట్ల లీటర్ల వ్యర్థాలు వదులుతూ, గోదావరిని కలుషితం.
- నోటీసులకు స్పందన లేక, కఠిన చర్యలకు పవన్ ఆదేశం.
Andhra Pradesh Deputy CM Pawan Kalyan | రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతూ, పన్నులు చెల్లించకుండా తీవ్ర బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు పుష్కరకాలం నుంచి స్థానిక సంస్థలకు రూ. 21.34 కోట్ల వరకు పన్నులు ఎగ్గొడుతూ, నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి టైం వేస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
రాజమహేంద్రవరంలో ఉత్పత్తయ్యే మొత్తం 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలలో సగం, అంటే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఒక్క ఆంధ్రా పేపర్స్ పరిశ్రమే విడుదల చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ పరిశ్రమ విడుదల చేసే నీటిలో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం, ఫాస్ఫేట్ 6 శాతం, సల్ఫైడ్స్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కంటే ఏకంగా 70 శాతం అధికంగా ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ అయిందన్నారు. దీనివల్ల గోదావరి నదిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు, పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు కలుషితమై స్థానిక ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యలను సరిదిద్దుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందస్తుగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ద్వారా పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆయన తెలిపారు. నిబంధనల ప్రకారం పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, సీజ్ చేయడం లేదా లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కి సమన్స్ జారీ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ ఉల్లంఘనలపై కోర్టులలో ఉన్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదులకు డిప్యూటీ సీఎం సూచించారు. 'స్వచ్ఛ గోదావరి- పవిత్ర పుష్కరాలు' థీమ్‌తో గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.
Frequently Asked Questions
ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై ప్రధాన ఆరోపణలు ఏమిటి?
ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ గోదావరిలోకి ఎంత వ్యర్థాలను విడుదల చేస్తోంది?
రాజమహేంద్రవరంలో ఉత్పత్తయ్యే మొత్తం 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలలో సగం, అంటే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఈ పరిశ్రమే విడుదల చేస్తోంది. ఈ వ్యర్థాలలో కాలుష్య కారకాలు అధికంగా ఉన్నాయని నిర్ధారణ అయింది.
ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
కూటమి ప్రభుత్వం ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చింది, చర్చలు జరిపింది. ఇప్పుడు సమన్స్ జారీ చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ స్థానిక సంస్థలకు ఎప్పటినుండి పన్నులు చెల్లించలేదు?
2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























