'డ్రాగన్' సినిమాకు బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్.
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
NTR Dragon Cast: ఎన్టీఆర్ 'డ్రాగన్'లోని నటీనటుల జాబితాలో బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' (కబీర్ సింగ్), 'ఆర్ఆర్ఆర్'లోని సీత పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. వాళ్ళిద్దరూ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది.

- ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'పై భారీ అంచనాలు.
- బాలీవుడ్ షాహిద్ కపూర్, ఆలియా భట్ 'డ్రాగన్'లో కీలక పాత్రలు.
- అనిల్ కపూర్ కీలక పాత్ర; ఎన్టీఆర్ కోలుకుంటున్నా షూటింగ్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'డ్రాగన్' (Dragon). దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్‌లో భారీ స్టార్ క్యాస్ట్ కనిపించింది. ఇప్పుడు ఆ లిస్టులో బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' (కబీర్ సింగ్) షాహిద్ కపూర్, 'ఆర్ఆర్ఆర్'లో సీతగా నటించిన అలియా భట్ పేర్లు యాడ్ అయ్యాయి.
బాలీవుడ్ స్టార్స్‌తో 'డ్రాగన్'తో భారీ క్రేజ్!
'డ్రాగన్'లో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్‌లో ఆయన లుక్ రివీల్ చేశారు. ఆర్మీ డ్రస్‌లో కపూర్ హీరో కనిపించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మరో ఇద్దరి కపూర్స్ యాడ్ అయ్యారు.
'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో భారీ హిట్ అందుకున్న హిందీ హీరో షాహిద్ కపూర్. ఆయన కూడా 'డ్రాగన్'లో ముఖ్యమైన పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' చేసిన ఆలియా భట్ కూడా ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మరో కీలక పాత్రలో కనిపించనున్నారట.
ఇండియాలోని అత్యంత విజయవంతమైన నటీమణులలోఆలియా భట్ ఒకరిగా పేరు పొందారు. ఆమెతో పాటు షాహిద్ కపూర్ 'డ్రాగన్'లో నటిస్తుండటం వల్ల ఈ సినిమా మార్కెట్, క్రేజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పాలి. ఎన్టీఆర్‌తో కలిసి షాహిద్ కపూర్ నటిస్తున్న తొలి సినిమా కూడా ఇది. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎవరూ ఊహించనిది. హిందీ మార్కెట్లో సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతోంది.
ఎన్టీఆర్ లేని సీన్స్ తీస్తున్న దర్శకుడు!
ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు ఎన్టీఆర్. అయినా సరే షూటింగ్ అసలు ఆగలేదు. ఇతర నటీనటులతో మిగతా సన్నివేశాల షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్.
ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి', 'కాంతార', 'టాక్సిక్' ఫేమ్ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్భూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.
Also Read: Sahaa Movie Review - సహ రివ్యూ: హీరోయిన్ అమీర్‌పేట్‌లో గుండు గీసుకోవాలా? లేదంటే సినిమా బావుందా?
Frequently Asked Questions
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'డ్రాగన్' సినిమాకు దర్శకుడు ఎవరు?
'డ్రాగన్' సినిమాలో కొత్తగా చేరిన బాలీవుడ్ నటీనటులు ఎవరు?
షాహిద్ కపూర్, ఆలియా భట్ 'డ్రాగన్' సినిమాలో కీలక పాత్రల కోసం ఎంపికయ్యారు. అనిల్ కపూర్ ఇప్పటికే ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.
'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయిక ఎవరు?
ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
'డ్రాగన్' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది?
ఎన్టీఆర్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇతర నటీనటులతో మిగతా సన్నివేశాల షూటింగ్ కొనసాగిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















