Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Vadala OTT Platform : జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వదలా. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Jagapathi Babu's Psychological Thriller Vadala OTT Streaming : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే...
ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్?
సీనియర్ హీరో జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ వదలా (Vadala). జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లో శుక్రవారం (ఆగస్ట్ 14) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీకి ఆకేళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించగా... జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్‌లతో పాటు శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, జెన్నీ, కశ్యప్ రాజ్, రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీని నిర్మించారు.
Also Read : Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
స్టోరీ ఏంటంటే?
వృత్తిపరంగా డాక్టర్ అయిన యోగి సిద్ధార్థ్ (జగపతి బాబు)కు భార్య ప్రియ (లయ) తన ఇద్దరు పిల్లలే ప్రపంచం. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా వారి దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన అముద (హృతిక శ్రీనివాస్)ను యోగి ఓ రోజు కాపాడతాడు. అలా అతనిపై ఆరాధనతో ఉన్న ఆమె ఎలాగైనా యోగిని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.
గుర్తు తెలియని ఫోన్ నెంబర్స్ నుంచి యోగికి. అతని భార్య ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తుంటుంది. ఓ సైకోలా ఇద్దరినీ వేధించడం మొదలుపెడుతుంది. అసలు అముద ఎవరు? ఆమె గతం ఏంటి? బాంబ్ బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన నివాస్ (శ్రీనివాస్ అవసరాల)కు ఆమెకు సంబంధం ఏంటి? ఆమెని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు గాలిస్తుంటారు? అముద గురించిన నిజాన్ని యోగి, ప్రియలు ఎలా తెలుసుకున్నారు? సైకో యువతి నుంచి తన కుటుంబాన్ని సిద్దార్థ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















