అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?

Telangana Congress Internal Fight: కాంగ్రెస్ పాలనపై రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి? ఆయన నిజంగానే పార్టీ పెడతారా లేక కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారా?

Rajagopal Reddy Revanth Reddy Row:   తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి పెద్ద దుమారాన్నే రేపాయి.  బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైంది ,  రాజకీయాలను మార్చే శక్తి నాకుంది అంటూ ఆయన చేసిన కామెంట్లు, కొత్త పార్టీ పెడతారా లేక స్వపక్షంపైనే తిరుగుబాటా అనే ఉత్కంఠను రేకెత్తించాయి.  

 ముఖ్యమంత్రి రేవంత్ పైనే పరోక్ష బాణాలు 

కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా జెండా మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర కాంట్రాక్టర్ల చెప్పుచేతల్లో ప్రభుత్వం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించడం నేరుగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించడమే. కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడం, తన కీలక అనుచరులకు ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల ఆయనలో గూడుకట్టుకున్న తీవ్ర అసంతృప్తికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

 మంత్రి పదవి కోసం బ్లాక్‌మెయిలింగ్ వ్యూహమా?

రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే, ఆయన ప్రెజర్ పాలిటిక్స్  చేయడంలో దిట్ట. గతంలో మునుగోడు ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ గూటికి రావడం ఆయన రాజకీయ వ్యూహాల్లో భాగమే. ప్రభుత్వం ఏర్పాటై ఇంతకాలమవుతున్నా తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో, అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి రాబోయే కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖరారు చేసుకోవడానికే ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం బలంగా ఉంది.

 కొత్త పార్టీ ప్రతిపాదన నిజమేనా?  

 తమిళనాడు తరహా రాజకీయ మార్పు తెస్తా, కొత్త రాజకీయ శక్తులను ప్రోత్సహిస్తా  అని ఆయన అనడం కొత్త పార్టీ వైపు సంకేతాలు ఇచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం అంత సులభం కాదు. బయటకు వస్తే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లాల్లో పట్టు ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఒక పార్టీని నడిపించే వ్యూహాత్మక నిర్మాణం, పార్టీ క్యాడర్ బలం తక్కువ. అందువల్ల  కొత్త పార్టీ అనేది ఒక హెచ్చరిక  మాత్రమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

 హుటాహుటిన క్లారిటీ ఇవ్వడం వెనుక కారణం 

సొంత పార్టీ నుంచే కాక, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర హెచ్చరికలు చేయడం తో రాజగోపాల్ రెడ్డి వెంటనే  డ్యామేజ్ కంట్రోల్  చర్యలకు దిగారు.  నేను కాంగ్రెస్ పార్టీని లేదా రాహుల్ గాంధీని విమర్శించలేదు, రాహుల్ నాయకత్వంలోనే పనిచేస్తా  అని వెనక్కి తగ్గారు. పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని గ్రహించి, లేదా అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతోనే ఆయన తన వ్యాఖ్యలకు సవరణ ఇచ్చుకున్నారు.  రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత అసమ్మతి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. రేవంత్ రెడ్డి వైఖరి పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులలో  ఉన్న అసంతృప్తికి రాజగోపాల్ రెడ్డి ఒక స్పానర్ లాగా మారారు. ఈ వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తప్పవు. ఒకవేళ ఆయన డిమాండ్లకు లొంగి మంత్రి పదవి ఇస్తే, పార్టీలో అసమ్మతి గళం విప్పే మిగతా నాయకులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి.

 రాజగోపాల్ రెడ్డిది మంత్రి పదవి ప్రయత్నమే

  రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో లేరు . ఆయన వ్యూహమల్లా తన వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కించుకోవడం, కేబినెట్‌లో మంత్రి పదవిని సాధించడం మాత్రమే. అయితే, ప్రభుత్వంపై ప్రతిపక్షాల కన్నా దారుణంగా అవినీతి, బయటివారి పెత్తనం  అంటూ బహిరంగంగా ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగి ఈ వివాదానికి స్వస్తి పలకకపోతే, ఇది తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున అంతర్గత కుమ్ములాటలకు దారితీసే అవకాశం ఉంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget