అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy:మంత్రి పదవి ఇస్తారా? లేకుంటే సీఎం సీటు లాక్కోవాలా? రాజగోపాల్‌ రెడ్డి హెచ్చరిక ఎవరికి? రేవంత్‌కా? కాంగ్రెస్‌కా?

Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రి సీటు లాక్కుంటానని హెచ్చరించారు.

Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలనే సాధించింది. ఈ  విజయంతో సంబరాల ఊపులో ఉన్న టైంలోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే డైరెక్ట్‌గా సీఎం కుర్చీనే టార్గెట్ లాక్కుంటానని హెచ్చరించారు. ఇప్పుడే కాదు ఆయన గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చాలా చేశారు. తనను పార్టీలోకి తిరిగి తీసుకున్నప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఇప్పుడు అది కావాలంటూ చాలా కాలం నుంచి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినా ఆయన్ని ఎవరూ పిలిచి మాట్లాడటం లేదు. ఆయన కామెంట్స్ ఆగటం లేదు. ఇప్పుడు మరోసారి కామెంట్స్‌తో వార్తలకెక్కారు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. అయితే ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత అక్కడి నుంచి 2023 ఎన్నికల టైంలో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పదవి హామీతోనే పార్టీలోకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇవ్వడం సాధ్యం కాదు. అయినా నాకు మంత్రి పదవి కావాల్సిందేనంటూ మొండికేస్తున్నారు. 

మంత్రి పదవి ఎలాగైనా సాధించుకోవాలని సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్‌ రెడ్డి టార్గెట్‌గా బాణాలు సంధిస్తూనే ఉన్నారు.  ఆయన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఒకట్రెండు సార్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలిచి మాట్లాడింది. కానీ వాటిని పట్టించుకోవడం లేదు. అందుకే రోజు రోజుకు ఆయన విమర్శల డోసు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాజగోపాల్‌ రెడ్డి మరోసారి మంత్రి పదవి అంశాన్ని ప్రస్తావించారు. 

పార్టీలోకి తీసుకొని వచ్చినప్పుడు తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిపదవి ఇవ్వాలని రాజగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే డైరెక్ట్‌గా సీఎం అవుతానంటూ హెచ్చరించారు. ఇకపై పదవి కావాలని అడుక్కోవడం ఉండదని నేరుగా సమయం వచ్చినప్పుడు సీఎం సీట్లో కూర్చోవడమే ఉంటుందని హెచ్చరించారు. కచ్చితంగా తనకు మంచి పదవి వస్తుందని కూడా నమ్మకం వ్యక్తం చేశారు. ఇలా మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజున ఇలాంటి అసంతృప్తి స్వరం వినిపించడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్‌గా ఉంటోంది. 

పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై కూడా ఇలానే రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది కాంగ్రెస్ రూల్స్‌కు విరుద్దమని పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలు ఉన్నాయని ఎక్స్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఆగస్టులో జరిగిన మంత్రివర్గ విస్తరణ టైంలో కూడా విమర్శలు చేశారు. ఆస్తులు అమ్మి పార్టీని గెలిపిస్తే తనను మోసం చేశారని మండిపడ్డారు. తనతోపాటు వచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారని తనను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే రాజగోపాల్ రెడ్డికి పడటం లేదు. ఆయన వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన వ్యక్తిని నేరుగా సీఎం సీటులో కూర్చోబెట్టడాన్ని తప్పుపడుతున్నారు. అందుకే సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది రేవంతే అనే భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అధిష్ఠానం వద్ద ఏదో ఒకటి చెప్పి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నారు. అందుకే సందర్భం ఏదైనా సరే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే నీ కుర్చీ లాక్కుంటా అంటూ రేవంత్ రెడ్డికే పరోక్షంగా సవాల్ చేస్తున్నారు. 

రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు జీవన్ రెడ్డి, ఇంకో వైపు జగ్గారెడ్డి లాంటి వాళ్లతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి విమర్శలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయని రాష్ట్ర నాయకత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నా వీళ్లు మాత్రం తమ పంథం వీడటం లేదు. సోదరుడు వెంకట్‌రెడ్డి కేబినెట్‌లో ఉండగానే రాజగోపాల్ రెడ్డికి పదవి ఎలా లభిస్తుందని పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. స్కూల్ పిల్లాడి మాదిరిగా మారం చేస్తున్నారని అంటున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Supreme Court: తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Embed widget