అన్వేషించండి

IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 

శ్రీలంకతో గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలని చూస్తున్న ఇండియాకు సవాలుగా మారింది.

Rain Threatens Galle Test Clash: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ చేరాలనే లక్ష్యంతో ఉన్న ఇండియన్ టీమ్, శ్రీలంకతో గాలే వేదికగా రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో 2-2 డ్రా, వెస్టిండీస్‌పై 2-0 గెలుపు, సౌత్ ఆఫ్రికాతో 0-2 ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఇండియా, ఫైనల్ బెర్త్ కోసం మిగిలిన చాలా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో రెడ్ బాల్ సిరీస్ ఆడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.  

చారిత్రాత్మక 600వ టెస్ట్ మ్యాచ్.. ముసురుకున్న నల్లని మేఘాలు
ఈ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ల్యాండ్‌మార్క్ 600వ టెస్ట్ కావడం విశేషం. ఆగస్టు 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ పోరుకు వర్షం తీవ్ర ముప్పుగా మారింది. శనివారం మ్యాచ్ ప్రారంభం కానుండగా, వాతావరణ శాఖ 90 శాతం వర్ష సూచన, 92 శాతం క్లౌడ్ కవర్ అంచనా వేసింది. ఐదు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో, సోనీలివ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా ఎటాక్..  పేస్ విభాగంలో గట్టి పోటీ 
గాలే పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ లతో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఇండియా రంగంలోకి దించనుంది. పేస్ విభాగంలో సీనియర్ మహమ్మద్ సిరాజ్ కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పాత బాల్ తో అద్భుతంగా బౌన్స్ రాబట్టగలడని కెప్టెన్ గిల్ ప్రశంసించాడు. ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉండటంతో అతడికే తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్.. వరుణుడిని తట్టుకుని గెలవాల్సిందే

వర్షం కారణంగా శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ కూడా అర్ధాంతరంగా ముగిసింది. క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నా మ్యాచ్ లో పైచేయి సాధించి సిరీస్ లో బోణీ కొట్టాలని ఇండియన్ టీమ్ పట్టుదలతో ఉంది. వర్షం అంతరాయాలు కలిగించినా తక్కువ సమయంలోనే ఫలితాన్ని రాబట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget