అన్వేషించండి

Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

Vande Mataram at Red Fort: దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సరికొత్త చరిత్రకు వేదిక అయ్యింది. ఢిల్లీలోని ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ గేయం " వందేమాతరం" ఆలపించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వందేమాతరం ఎర్రకోటలో మొదటిసారి అధికారికంగా ఆలపించి చరిత్ర సృష్టించింది.
  • ప్రధాని రాగానే వందేమాతరం ఆలపించి, జాతీయ గీతం కొనసాగింది.
  • 2500 మంది NCC క్యాడెట్లు వందేమాతరం మానవ ఆకృతి సృష్టించారు.

Vande Mataram at Red Fort: భారత్ స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షల మంది వీరులను ఉత్తేజపరిచిన అమర గీతం వందేమాతరం. బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన ఈ నినాదం, ఇప్పుడు స్వతంత్ర భారత దేశ సార్వభౌమాధికార ప్రతీక అయిన ఎర్రకోట వేదికపై అధికారికంగా ప్రతి ధ్వనించింది. ఇప్పటి వరకు ఎర్రకోట వేడుకల్లో కేవలం జాతీయ గీతమైన జనగణమన కు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. కానీ 80వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వందేమాతరం గీతాన్ని కూడా ప్రధాన ప్రోటోకాల్‌లో చేర్చి ఆలపించి సరికొత్త చరిత్రకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 

ఈ చారిత్రక నిర్ణయం వెనుక బలమైన నేపథ్యం ఉంది. బంకించంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం  గేయాన్ని రచించారు. 2026 నాటికి ఈ మహత్తర గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ గేయం పాడినందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఎందరో భారతీయులను జైలుకు పంపించింది. అటువంటి మహత్తర గీతానికి ఎర్రకోట వేదికపై అత్యున్నత గౌరవం కల్పించడం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ప్రభుత్వం భావన. 

సాధారణంగా ఎర్రకోటపై జరిగే కార్యక్రమాల్లో ఒక నిర్ధిష్ట క్రమం ఉంటుంది. అయితే ఈసారి ఆ క్రమంలో మార్పులు చేశారు. ప్రధాని మోదీ ఎర్రకోట ప్రాంగణంలోకి అడుగు పెట్టే సరికి అక్కడ వందేమాతరం గీతాన్ని ప్రత్యక్షంగా ఆలపించారు. అనంతరం ప్రధాని గౌరవ వందనాన్ని స్వీకరించి ఎర్రకోట బురుజుపైకి చేరుకున్నారు. ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే జనగణమన గీతం వినిపించింది. అదే టైంలో భారత వైమానిక దళానికి చెందిన Mi-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించింది. 

వందేమాతరం హ్యూమన్ ఆకృతి 

ఈ ఏడాది వేడుకల్లో మరో విజువల్ వండర్‌గా నిలిచిన మరో అంశం జ్ఞానపథ్‌. ఎర్రకోట ముందున్న మైదానంలో 2500 ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ యువ వాలంటీర్లు ప్రత్యేకంగా కూర్చున్నారు. వీరు ఆ మైదానంలో వందేమాతరం అనే హిందీ అక్షరాల ఆకృతిలో కూర్చొని అద్భుతమైన హ్యూమన్ ఫార్మేషన్ సృష్టించారు. డ్రోన్ కెమెరాల ద్వారా  విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు కనువిందు చేశాయి. 

ఈసారి వేడుకలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం మార్పులు చేసింది. గతంలో ఉన్న వీఐపీ బోర్డులను తొలగించి, ఆయా సీటింగ్ బ్లాక్‌లకు భారత్‌లోని ప్రసిద్ధ సరస్సులు దాల్‌, చిల్కా, కొల్లేరు, హుస్సేన్ సాగర్ వంటి పేర్లు పెట్టారు. పర్యావరణహితంగా ఉండేందుకు కాగితపు పాస్‌లకు బదులుగా డిజిటల్‌ క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ పాస్‌లను తీసుకొచ్చారు. వేడుకలకు హాజరయ్యే సాధారణ పౌరులకు ఢిల్లీ మెట్రో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 

ఈ వేడుకలను అత్యున్నత సాంకేతికతతో 4k క్వాలిటీలో లైవ్ ప్రసారం చేశారు. వేడుకలు ముగిసిన తర్వాత స్వచ్ఛత ప్రచారం పేరుతో పరిసరాలను శుభ్రపరిచే ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాన్ని కూడా రక్షణ శాఖ ప్లాన్ చేసింది. ఈ వేడుకులకు FPOs, సర్పంచ్‌లు, గిరిజన కళాకారులు వంటి 5000 మందిని విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు. 


  

Frequently Asked Questions

ఈసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఎందుకు చేర్చారు?

స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం గేయం పోషించిన పాత్రకు, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా దీనిని చేర్చారు. 2026 నాటికి ఈ గేయానికి 150 ఏళ్లు పూర్తవుతుంది.

ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఎవరు రచించారు?

వందేమాతరం గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875లో రచించారు. ఇది స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో చాలా మందిని ఉత్తేజపరిచింది.

ఈ ఏడాది ఎర్రకోట వేడుకల్లో జ్ఞానపథ్ వద్ద ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఏమిటి?

2500 ఎన్సీసీ క్యాడెట్లు మరియు మై భారత్ యువ వాలంటీర్లు

ఎర్రకోట వేడుకల ప్రోటోకాల్‌లో ఈసారి ఎలాంటి మార్పులు చేశారు?

ప్రధానమంత్రి ఎర్రకోటలోకి అడుగుపెట్టినప్పుడు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన తర్వాత జనగణమన గీతం వినిపించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget