దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శనివారం (ఆగస్టు 15, 2026) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Independence Day 2026: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిలతోపాటు చాలా మంది రాజకీయ, సినీ ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

- 80వ స్వాతంత్ర్య దినోత్సవం; ప్రధాని మోదీ శుభాకాంక్షలు, వికసిత భారత్ లక్ష్యం.
- ప్రధాని మోదీ ఎర్రకోటపై 13వసారి జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
- చంద్రబాబు, పవన్ దేశ నిర్మాణానికి ప్రజల సహకారం కోరారు.
Independence Day 2026: దేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం (ఆగస్టు 15, 2026) జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ లో ఒక మేసేజ్‌ను పోస్ట్ చేశారు.
తమ ధైర్యసాహసాలతో, త్యాగాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులందరినీ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు దేశాన్ని ముందుకు నడిపించడానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం గురించి ప్రస్తావన
తన సందేశంలో ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధి ప్రయాణం మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలను స్వీకరించి, అభివృద్ధి చెందిన దేశ సంకల్పాన్ని నెరవేర్చడానికి దోహదపడాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎర్రకోటపై 13వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్న మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన సందేశాన్ని ముగిస్తూ, ప్రధానమంత్రి పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, దేశం కోసం పోరాడిన ధైర్యవంతులైన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.
చేతిలో జెండా, గుండెల్లో అజెండా: చంద్రబాబు
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. "ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు ‘అనే నేను...’ సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు... దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి... మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్... స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు... వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం." అని పిలుపునిచ్చారు.
పవిత్ర బాధ్యతగా భావించాలి: పవన్
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తమ ధైర్యం, త్యాగం, దేశభక్తితో మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛను సాధించిన స్వాతంత్ర్య సమరయోధులకు హృదయపూర్వక నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. "మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ తేలికగా తీసుకోవలసిన బహుమతి కాదని, అది మన జాతీయ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి చేపట్టిన ఒక పవిత్ర బాధ్యత అని వారి జీవితాలు మనకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయి.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గడిచిన దశాబ్దాల్లో, దేశం నిశ్శబ్దమైన సంకల్పంతో, అద్భుతమైన ఆశయంతో ఎదిగింది. ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఆవిర్భవించడం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో చారిత్రాత్మక ల్యాండింగ్ అవ్వడం నుంచి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం, యూపీఐ ద్వారా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను సృష్టించడం, మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ వేదికపై ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా స్థిరపడటం వరకు - ఈ విజయాలు భారత ప్రజల ప్రతిభకు, అకుంఠిత స్ఫూర్తికి సజీవ నిదర్శనం.
విభజనతో దెబ్బతిన్న దేశాన్ని వారసత్వంగా పొంది, ఐక్యత, పునర్నిర్మాణం, ప్రగతి అనే ఉన్నత మార్గాన్ని ఎంచుకున్న ఆ మహనీయ రాజనీతిజ్ఞులకు, జాతినిర్మాతలకు నేను ప్రగాఢ గౌరవంతో నమస్కరిస్తున్నాను. వారి దార్శనికత, ధైర్యసాహసాలతో, నేడు మనం గర్వంగా నివసిస్తున్న ఈ భారత్‌కు వారు పునాదులు వేశారు.
మన స్వాతంత్ర్య సమరయోధుల, దార్శనిక నాయకుల నుంచి శాశ్వతమైన స్ఫూర్తిని పొంది, వారి స్ఫూర్తిని దేశ నిర్మాణ కార్యంలో ముందుకు తీసుకువెళ్దాం. మన యువత స్పష్టమైన లక్ష్యంతో, నైతిక ధైర్యంతో నాయకత్వం వహించాలి. రాజకీయ విభజనలకు, సామాజిక విభేదాలకు అతీతంగా ఎదగాలి. ప్రతి పల్లెటూరు, పట్టణం, నగరంలోని ప్రతి పౌరుడు, రాబోయే తరాల కోసం బలమైన, సుసంపన్నమైన, స్వయం సమృద్ధిగల, నిజమైన వికసిత భారత్‌ను నిర్మించడానికి చిత్తశుద్ధితో తమ వంతు కృషి చేయాలి." అని రాసుకొచ్చారు. ఇది మన సమిష్టి ధర్మం అని, ఇది మన ఉమ్మడి గమ్యం అని పేర్కొన్నారు. .
Frequently Asked Questions
80వ స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నారు?
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమి చేయనున్నారు?
ప్రధాని మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన దేశం కోసం పోరాడిన ధైర్యవంతులకు నివాళులర్పించారు.
ప్రధానమంత్రి మోదీ తన సందేశంలో ఏ లక్ష్యం గురించి ప్రస్తావించారు?
ప్రధానమంత్రి తన సందేశంలో 'అభివృద్ధి చెందిన భారత్' లక్ష్యం గురించి ప్రస్తావించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలిసికట్టుగా దీనిని సాధించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో దేనిని ఉద్ఘాటించారు?
మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారం కావాలన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















