తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Trisha Attends Independence Day Celebration: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిష హాజరయ్యారు. సీఎం విజయ్ కు కనిపించేలా కూర్చున్నారు.

- తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సీఎం విజయ్ నేతృత్వంలో వైభవంగా జరిగాయి.
- ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌కు వేడుకల్లో ముందు వరుసలో ప్రత్యేక గౌరవం దక్కింది.
- ముఖ్యమంత్రి విజయ్‌తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం, ప్రాధాన్యత చర్చనీయాంశమైంది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా, అభిమానుల దళపతిగా గతంలో ఎన్నోసార్లు జెండా ఎగుర వేసిన విజయ్... ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో మువ్వన్నెల జెండా ఎగురు వేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి స్టార్ హీరోయిన్, విజయ్ సన్నిహితురాలు త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హాజరు కావడం అందరి దృష్టిలో పడింది.
విజయ్ ముందు వరుసలో త్రిష!
ఆగస్టు 15వ తేదీ... శుక్రవారం ఉదయం జరిగిన తమిళ రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో త్రిషను గౌరవప్రదంగా చూసుకున్నారు అధికారులు. ఆమెకు ముందు వరుసలో సీటు ఇచ్చారు. పసుపు రంగు చీర, జడలో మల్లెపూలు ధరించి సంప్రదాయబద్ధమైన ఆహార్యంలో హుందాగా కార్యక్రమానికి విచ్చేశారు. సీఎంగా ఈ వేడుకలో విజయ్ వస్తున్న సమయంలో ఆయన కోసం త్రిష ఎదురు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Also Read: Vishal Makutam Review In Telugu - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
🚨 BREAKING: Actress Trisha attended the 80th Independence Day celebrations at Fort St. George, Chennai, where she was seated in the front row ahead of Chief Minister C. Joseph Vijay's National Flag hoisting ceremony. pic.twitter.com/TWKTN7SiEW
— Actor Vijay Team (@ActorVijayTeam) August 15, 2026
ఇండిపెండెన్స్ డే వేడుకలకు త్రిష హాజరైన ఓ వీడియోను 'యాక్టర్ విజయ్ టీమ్' ట్వీట్ చేసింది. అది కొన్ని నిమిషాల్లో వైరల్ అయ్యింది. ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ వేదికపైకి చేరుకుని మువ్వన్నెల మన దేశ పతాకాన్ని ఆవిష్కరణ చేస్తే... ముందు వరుసలో కూర్చున్న త్రిష చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించారు.
Trisha arrives 🙂 pic.twitter.com/XLtTRgWDR4
— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) August 15, 2026
వెండితెరపై విజయ్, త్రిష జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకలో ఆమెకు ముందు వరుసలో స్థానం లభించడం తమిళనాడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది. విజయ్ సన్నిహితురాలిగా వార్తల్లో నిలుస్తున్నారు త్రిష. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. అది మరింత చర్చకు దారి తీసింది. ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె లభించిన గౌరవం చూస్తే... ఆమెకు తమిళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయ్ ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Frequently Asked Questions
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగాయి?
ముఖ్యమంత్రి హోదాలో జెండా ఎగురవేసింది ఎవరు?
తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఉన్న విజయ్, ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో మువ్వన్నెల జెండాను ఎగురు వేశారు.
ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ సినీ నటి ఎవరు?
స్టార్ హీరోయిన్, విజయ్ సన్నిహితురాలు త్రిష కృష్ణన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమెకు ముందు వరుసలో సీటు ఇచ్చి గౌరవించారు.
త్రిషకు లభించిన ప్రాధాన్యత గురించి రాజకీయ వర్గాల్లో చర్చ ఎందుకు జరిగింది?
విజయ్ సన్నిహితురాలిగా ఆమెకు ముందు వరుసలో స్థానం లభించడం, గతంలో ఆమెపై జరిగిన వ్యాఖ్యల కారణంగా ఇది చర్చనీయాంశమైంది. ఇది సీఎం విజయ్ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు






















