తెలుగులో త్రిష మెమరబుల్ రోల్స్, హిట్ ఫిలిమ్స్ గుర్తు ఉన్నాయా?

తెలుగు తెరకు త్రిష కథానాయికగా పరిచయమైన సినిమా 'వర్షం'. అది బ్లాక్ బస్టర్ హిట్.

'వర్షం' తర్వాత 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చేశారు త్రిష. అదీ బ్లాక్ బస్టర్. ఆ సినిమాలో రోల్ కూడా బావుంటుంది.

'అతడు' రిలీజ్ టైంలో కంటే తర్వాత ఎక్కువ పేరొచ్చింది. పూరి పాత్రలో త్రిష నటన, సినిమా సూపర్. 

'పౌర్ణమి'లో త్రిష పాత్ర నిడివి తక్కువైనా ఆవిడ నటన, పాటలు బావున్నాయి. ఆ మూవీలో ఆవిడ హిట్టు.

'పౌర్ణమి' తర్వాత 'స్టాలిన్', 'సైనికుడు' సినిమాలు త్రిషకు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. ఆ పాత్రలకూ పేరు రాలేదు.

'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'లో త్రిష పాత్రకు, ఆమె నటనకు పేరొచ్చింది. సినిమా కూడా హిట్టు.

రవితేజకు జంటగా నటించిన 'కృష్ణ' కమర్షియల్ పరంగా త్రిషకు సూపర్ సక్సెస్ ఇచ్చింది. 

'వర్షం' తర్వాత ప్రభాస్‌తో నటించిన 'బుజ్జిగాడు' ఫ్లాప్‌ కాగా... 'కింగ్' చెప్పుకోదగ్గ సక్సెస్ ఇచ్చింది.

'నమో వెంకటేశాయ', 'తీన్ మార్', 'దమ్ము', 'బాడీ గార్డ్', 'లయన్' సినిమాలు త్రిష కెరీర్‌లో ఉన్నాయి.

'లయన్' తర్వాత డబ్బింగ్ సినిమాలతో నెట్టుకొచ్చిన త్రిష... 'విశ్వంభర'తో గ్రాండ్ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.