లాక్మే ఫ్యాషన్ వీక్ షో స్టాపర్​గా వచ్చిన జాన్వీ కపూర్ తన ఔట్​ఫిట్​తో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది.

రోబ్ కోట్ ధరించి వచ్చిన ఈ భామ.. దానిని రివిల్ చేస్తూ.. బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్​లో అలరించింది.

బంధని ప్రింట్​తో ప్యాడెడ్ షోల్డర్​తో ఈ డ్రెస్​ని రాహుల్ మిశ్రా అండ్ టీమ్ రూపొందించారు.

బంధని ప్రింట్​తో ఆధునిక ఫ్యాషన్​ను జోడించి.. డ్రెస్​ లుక్​ని రెట్టింపు చేశారు.

థై వరకు స్ప్లిట్​తో వచ్చిన ఈ డ్రెస్​ మంచి ఫిట్టింగ్​తో స్వీట్ హార్ట్ డీప్​ నెక్​తో ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.

ఈ డ్రెస్​ లుక్​కి జాన్వీ అందం మరింత యాడ్​ ఆన్​గా మారింది. ఆమె తన లుక్స్​తో షోని స్టీల్ చేసింది.

డ్రెస్​ లుక్​కి తగ్గట్లుగా హై హీల్స్ వేసుకుని చెవులకు డైమండ్ రింగ్స్ పెట్టుకుని సింపుల్​గా ముస్తాబైంది.

గోల్డెన్ మేకప్​ లుక్​లో హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు, వీడియోలకు జాన్వీ అదిరే ఫోజులిచ్చింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం జాన్వీ తెలుగులో రామ్ చరణ్​కు జోడిగా పెద్ది సినిమాలో హీరోయిన్​గా చేస్తోంది.