విక్రమ్ నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఏవో తెలుసా?

'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'నాన్న'తో విక్రమ్ తెలుగులోనూ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు విక్రమ్.

కోలీవుడ్ సినిమాలతో విక్రమ్ స్టార్ అయ్యారు. అయితే, కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన తెలుగు సినిమాలు చేశారు.

విక్రమ్ తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా 'అక్క పెత్తనం చెల్లి కాపురం'. ఆ చిత్రానికి దాసరి దర్శకుడు.

దాసరి సినిమా తర్వాత 'చిరునవ్వుల వరమిస్తావా' సినిమా చేశారు విక్రమ్.

ఏయన్నార్, జయసుధ జంటగా దాసరి తీసిన 'బంగారు కుటుంబం' సినిమాలోనూ విక్రమ్ నటించారు.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన 'ఆడాళ్ళా మజాకా'లో విక్రమ్ హీరో.

హీరోయిన్ ఊహ టైటిల్ రోల్ చేసిన 'ఊహ' సినిమాలో హీరో కూడా విక్రమ్.

'బంగారు కుటుంబం' తర్వాత జయసుధ, విక్రమ్ నటించిన సినిమా 'అక్కా! బాగున్నావా'.

'మెరుపు'లోనూ విక్రమ్ నటించారు. అందులో బ్రహ్మానందం పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ చేశారు.

క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సౌందర్య '9 నెలలు' సినిమాలోనూ విక్రమ్ హీరో.

'9 నెలలు' తర్వాత విక్రమ్ మరో తెలుగు సినిమా చేయలేదు. తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యారు.

'యూత్' అని విక్రమ్ హీరోగా ఒక తెలుగు సినిమా మొదలైనా... మధ్యలో ఆగింది.

ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ బోర్డర్స్ లేవు. దాంతో విక్రమ్ ప్రతి సినిమా తెలుగు, హిందీలో డబ్బింగ్ అవుతోంది.