ఎవరీ నేహా కక్కర్... Crying Starగా వైరల్ అవుతోన్న బాలీవుడ్ సింగర్ డీటెయిల్స్ తెల్సా?

హిందీ పాటలు వినేవాళ్లకు, సింగింగ్ రియాలిటీ షోస్ చూసేవాళ్లకు నేహా కక్కర్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. 

నేహా కక్కర్ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్. ఆవిడ జూన్ 6, 1988లో జన్మించింది (ప్రస్తుత వయసు 36 ఏళ్లు). 

నేహా కక్కర్ బాల్యంలో రిలీజియస్‌ ఈవెంట్స్‌లో పాటలు పాడారు. చిన్నప్పటి నుంచి ఆవిడకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్.

నేహా కక్కర్ సింగింగ్ కెరీర్ కోసం ఆమె ఫ్యామిలీ రిషికేశ్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు.

ఇండియన్ ఐడల్ సెకండ్ సీజన్ (2005)లో నేహా కక్కర్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు.

'మీరాబాయి నాట్ అవుట్'లో నేహా కోరస్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు సాంగ్స్ పాడారు.

'ఇండియన్ ఐడల్'లో పార్టిసిపేట్ చేసిన ఆవిడ... తర్వాత ఆ షో సహా కొన్ని రియాలిటీ షోలకు జడ్జ్‌గా చేశారు. 

సెకండ్ హ్యాండ్ జవానీ (కాక్‌టైల్), సన్నీ సన్నీ (యారియాన్), లండన్ తుమ్కడా (క్వీన్) పాటలు నేహాకు పేరు తెచ్చాయి.

గాయకుడు రోహన్ ప్రీత్ సింగ్‌తో 2020లో నేహా కక్కర్ వివాహం జరిగింది. ఆయన కూడా సింగర్.

నేహాకు ఓ సిస్టర్ సోనూ కక్కర్, బ్రదర్ టోనీ కక్కర్ ఉన్నారు. వాళ్లిద్దరూ కూడా సింగర్స్.

ఇండియా 'ఫోర్బ్స్ సెలబ్రిటీ 100' లిస్టులో 2017, 2019లో నేహా కక్కర్ పేరు వచ్చింది.

డిసెంబర్ 2020లో ఫోర్బ్స్ విడుదల చేసిన ఆసియాలోని టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో నేహా కక్కర్ పేరు ఉంది.

యూట్యూబ్ డైమండ్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ సింగర్ నేహా కక్కర్. ఇంకా పలు రికార్డ్స్ ఉన్నాయి.