ప్రియదర్శిని కమెడియన్, హీరో ఫ్రెండ్ రోల్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూడవద్దు.

హీరోగానూ ప్రియదర్శి సక్సెస్ అయ్యారు. ఆయన హీరో అంటే సినిమా హిట్టే. ఆ ఫిలిమ్స్ ఏవో చూడండి.

ప్రియదర్శి హీరోగా నటించిన మొదటి సినిమా 'మల్లేశం'. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి ఓ హీరో. ఆ సిరీస్ ఆయనకు మంచి హిట్ అందించింది.

'బ్రోచేవారెవరురా', 'జాతి రత్నాలు', 'ఓం భీమ్ బుష్' సినిమాల్లో హీరో స్నేహితునిగా ప్రియదర్శి కనిపించారు.

ఆ మూడు సినిమాల విజయాల్లో ప్రియదర్శి పాత్ర కీలకం. ఆయన కామెడీ టైమింగ్ హెల్ప్ అయ్యింది.

'మల్లేశం' తర్వాత ప్రియదర్శి సోలో హీరోగా నటించిన 'బలగం' విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు అందుకుంది.

అజయ్ భూపతి దర్శకత్వంలోని పాయల్ రాజ్‌పుత్‌ 'మంగళవారం'లోనూ ప్రియదర్శి హీరో.

'ఓం భీమ్ బుష్' తర్వాత 'డార్లింగ్'తో ప్రియదర్శి ఫ్లాప్ అందుకున్నారు. నభా నటేష్ జోడీగా నటించిన ఆ మూవీ నవ్వించలేదు.

'35 చిన్న కథ కాదు'లో ప్రియదర్శి యాంటీ హీరో (విలన్) రోల్ చేసి డిఫరెంట్ యాక్టింగ్ చూపించారు.

'కోర్టు: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'లోనూ ప్రియదర్శి హీరో. ఆయన డిఫరెంట్ లాయర్ రోల్ చేశారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలోని 'సారంగపాణి జాతకం'లోనూ ప్రియదర్శి హీరో.