'టిల్లు'కు ముందు... క్యారెక్టర్ ఆర్టిస్టుగా సిద్ధు చేసిన సినిమాలు తెలుసా?

టిల్లు సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డకు పాపులారిటీ వచ్చింది. దానికి ముందు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు.

సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు తెరకు పరిచయమైన సినిమా నాగ చైతన్య 'జోష్'. అందులో స్టూడెంట్ రోల్ చేశారు.

రామ్ చరణ్ 'ఆరెంజ్'లో సిద్ధూ జొన్నలగడ్డ నటించారు. జెనీలియాకు లైన్ వేసే అబ్బాయిగా కనిపించారు. 

రవితేజ 'డాన్ శీను' సినిమాలో చిన్న రోల్ చేశారు సిద్ధూ! అయితే 'జోష్', 'ఆరెంజ్' అంత పెద్ద రోల్ కాదు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'లైఫ్ బిఫోర్ వెడ్డింగ్'లోనూ సిద్ధూ ఒక రోల్ చేశారు. 

'బాయ్ మీట్స్ గాళ్', 'ఐస్ క్రీమ్ 2' సినిమాల్లోనూ సిద్ధూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. 

'గుంటూరు టాకీస్'తో సిద్ధూ జొన్నలగడ్డను ప్రవీణ్ సత్తారు హీరో చేశారు. 

రాజశేఖర్ 'కల్కి'లో విలనీ షేడ్ ఉన్న పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.

'కల్కి' తర్వాత హీరోగా సినిమాలు చేసిన సిద్ధూ, రవితేజ 'మిస్టర్ బచ్చన్'లో స్పెషల్ గెస్ట్ రోల్ చేశారు.