ఎవరీ దివ్య భారతి? జీవీ ప్రకాష్‌తో ఆవిడ రిలేషన్ ఏమిటి?

సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్ కుమార్ విడాకుల తర్వాత దివ్య భారతి పేరు ఎక్కువ వినిపించింది.

దివ్యభారతితో జీవీ ప్రకాష్ కుమార్ రిలేషన్షిప్‌తో ఉండటంతో విడాకుల తీసుకున్నారని పుకార్లు వినిపించాయి.

జీవీ ప్రకాష్ కారణంగా దివ్యభారతి వార్తల్లో నిలిచారు. అసలు ఎవరీ అమ్మాయి? అనేది చూస్తే...

తమిళనాడులోని కోయంబతూరుకు చెందిన అమ్మాయి దివ్యభారతి

'బ్యాచిలర్'లో జీవీ ప్రకాష్ కుమార్, దివ్యభారతి జంటగా నటించారు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీకి పేరొచ్చింది.

'బ్యాచిలర్' తర్వాత 'కింగ్స్టన్' సినిమాలోనూ జీవీ ప్రకాష్, దివ్య భారతి జంటగా నటించారు.

'బ్యాచిలర్'లో కెమిస్ట్రీ బావుండటం, 'కింగ్స్టన్'కు జీవీ ప్రకాష్ హీరో & నిర్మాత కావడంతో రిలేషన్ ఉందని ప్రచారం మొదలైంది.

'కింగ్స్టన్' విడుదలకు ముందు తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ క్వశ్చన్స్ ఎదురయ్యాయి.

తమ మధ్య ఏమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని జీవీ ప్రకాష్, దివ్యభారతి క్లారిటీ ఇచ్చారు.

'బ్యాచిలర్' తర్వాత 'మహారాజా'లో విజయ్ సేతుపతి భార్యగా దివ్యభారతి నటించారు. 

'మహారాజా'లో దివ్యభారతి క్యారెక్టర్ కనిపించేది కాసేపే అయినా ఆమెకు మంచి పేరొచ్చింది. 

తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన 'గోట్'లో దివ్యభారతి నటించారు. అది విడుదల కావాలి. 

'కింగ్స్టన్' తర్వాత దివ్యభారతికి తమిళంలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.