సింగర్ కల్పన బ్యాగ్రౌండ్ ఏమిటి? ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసా?

మార్చి 4, 2025న సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఎవరీ కల్పనా రాఘవేందర్? అనే ప్రశ్న మొదలైంది.

కల్పనది తమిళనాడు. మే 8, 1980లో చెన్నైలో ఆవిడ జన్మించారు. ప్రస్తుతం ఆవిడ వయసు 44 ఏళ్ళు.

కల్పన తండ్రి పేరు టీఎస్ రాఘవేంద్ర. ఆయన నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు.

కల్పన తల్లి సులోచన కూడా సింగర్. తల్లిదండ్రులు గాయకులు కావడంతో చిన్నతనం నుంచి సింగింగ్ నేర్చుకున్నారు.

మదురై టి శ్రీనివాసన్ దగ్గర కల్పన కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నారు. కల్పన చెల్లెలు ప్రసన్న కూడా సింగర్. 

మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ చేసిన కల్పన... సింగింగ్‌ని ఫుల్ టైం ప్రొఫెషన్‌గా ఎంపిక చేసుకున్నారు.

కల్పనకు ప్రభాకర్ రెండో భర్త. మొదటి భర్తతో విడాకులు అయ్యాయి. ఆమెకు ముగ్గురు పిల్లలు అని టాక్.

ఐదేళ్ల వయసులో కల్పన మొదటి పాట పాడారు. ఆరేళ్ల వయసులో తమిళ సినిమా 'పున్నాగై మన్నన్'లో నటించారు.

మణిశర్మ సంగీతంలో 'మనోహరం' సినిమాలోని 'మంగళగౌరికి' పాటతో ఫుల్ టైమ్ సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు.

కల్పన మూడు వేలకు పైగా స్టేజి షోలు చేశారు. ఆవిడ అందుకు పాపులర్ కూడా.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేశారు కల్పన. ఏషియానెట్ 'స్టార్ సింగర్' సీజన్ 5 విన్నర్ కూడా!

'ఇంటింటి రామాయణం' సినిమాలోని 'నవమూర్తులైనట్టి' పాటకు ఆవిడ నంది అవార్డు అందుకున్నారు. 

తమిళంలో జ్యోతిక '36 వయనిధిలే' సినిమాలో 'పొగిరెన్' పాటకు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు.