విష్ణు మంచు కెరీర్‌లో సూపర్ హిట్స్... 'కన్నప్ప'కు ముందు ఈ సినిమాలపై ఓ లుక్ వేయండి

'విష్ణు' సినిమాతో విష్ణు మంచు హీరోగా పరిచయమైనా... 'ఢీ' ఆయనకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది.

'ఢీ' తర్వాత చేసిన 'కృష్ణార్జున', 'సలీమ్', 'వస్తాడు నా రాజు' సినిమాలు అంతగా ఆడలేదు.

'దేనికైనా రెడీ'తో మళ్ళీ విష్ణు మంచు హిట్ అందుకున్నారు. నిర్మాతకు డబ్బులతో పాటు ప్రేక్షకులకు నవ్వులు పంచింది.

'దేనికైనా రెడీ' తర్వాత చేసిన 'దూసుకెళ్తా' కూడా మంచి విజయం సాధించింది.

మంచు ఫ్యామిలీ నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద'తో విష్ణు హ్యాట్రిక్ అందుకున్నారు.

వరుస ఎంటర్‌టైనర్స్‌ తర్వాత రామ్ గోపాల్ వర్మ యాక్షన్ ఫిల్మ్ 'రౌడీ'తో మరో హిట్ కొట్టారు.

'అనుక్షణం' ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మెప్పించింది.

'ఈడో రకం ఆడో రకం' కూడా ప్రేక్షకుల్ని నవ్వించి విష్ణు ఖాతాలో హిట్ వేసింది.

'లక్కున్నోడు', 'గాయత్రి', 'ఆచారి అమెరికా యాత్ర', 'ఓటర్', 'మోసగాళ్లు' ఫ్లాప్స్ అయ్యాయి.

'జిన్నా'తో విష్ణు మంచు చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ, కొందర్ని మెప్పించింది.

'కన్నప్ప'తో విష్ణు మంచు పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.