Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Jabardasth Team : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులు గాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వారు వెళ్తుండగా పాలకోడేరు సమీపంలో ఈ ఘటన జరిగింది.

Jabardasth Team Members Injured In Accident : ఫేమస్ కామెడీ షో 'జబర్దస్' టీం సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జబర్దస్త్ టీం సభ్యులు కారులో కాకినాడ నుంచి భీమవరం వైపు వెళ్తుండగా... వారి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో రైజింగ్ రాజు, దొరబాబులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వీరు ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























