అన్వేషించండి

NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?

Modi Shah Command NDA: ఎన్డీఏ కన్వీనర్ పదవిని పునరుద్ధరిస్తున్నారా? చంద్రబాబు లేదా నితీష్‌లలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందా? ఢిల్లీ వర్గాల్లో ప్రచారం, బీజేపీ హైకమాండ్ మనసులో ఏముంది?

BJP Coalition Politics:   ఢిల్లీ రాజకీయ వేదికలపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి  కన్వీనర్ పదవి పునరుద్ధరణ అంశం అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారడం కొత్తేమీ కాదు. ఇటీవల కొందరు ఎంపీల వ్యాఖ్యల ఆధారంగా ఈ పదవి రేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,  బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉండే అవకాశం ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ వంటి అగ్రనేతలు ఎన్డీఏ కన్వీనర్లుగా వ్యవహరించి కూటమి సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.  అయితే, ప్రస్తుత మారుతున్న జాతీయ రాజకీయ సమీకరణల దృష్ట్యా, బీజేపీ హైకమాండ్ నిజంగానే అలాంటి ఒక అధికారిక పదవిని పునరుద్ధరిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 కేంద్రీకృత నాయకత్వం..  మోదీ - షా  మార్క్ శైలి 

ప్రస్తుత ఎన్డీఏ నిర్మాణం గతంలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అద్వానీ కాలం నాటి కూటమికి పూర్తిగా భిన్నమైనది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్ణయాధికారాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడి చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన  షిండే వర్గం , లోక్ జనశక్తి వంటి పార్టీల అగ్రనేతలతో బీజేపీ హైకమాండ్ నేరుగా కమ్యూనికేషన్ ఛానెళ్లను నిర్వహిస్తోంది. మధ్యలో మరొక స్వతంత్ర కన్వీనర్ పదవిని సృష్టిస్తే, అది విధానపరమైన స్పష్టతను పెంచకపోగా.. నిర్ణయాధికారాల్లో మరొక సమాంతర శక్తి కేంద్రం  ఏర్పడే ప్రమాదం ఉందని బీజేపీ  భావిస్తోంది.  

 చంద్రబాబు, నితీష్ పేర్ల ప్రచారం

ఒకవేళ కన్వీనర్ పదవి ఇచ్చినా చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ దాన్ని స్వీకరించేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉంటారనేది ప్రధానాంశం. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర పాలనపైనే పూర్తి దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో బాధ్యతలు తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలపై పట్టు సడలే అవకాశం ఉంటుంది. మరోవైపు నితీష్ కుమార్  అనారోగ్య కారణాలతో  రాజ్యసభకు వెళ్లారు. ఆయన యాక్టివ్‌గా ఉండటం కష్టం.  అందుకే ఇద్దరూ ఢిల్లీ వేదికగా దైనందిన సమన్వయం చేసే పూర్తిస్థాయి కన్వీనర్ పాత్ర వారికి ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చునని భావిస్తున్నారు. 

స్వతంత్ర వ్యవస్థలతో వచ్చే రాజకీయ రిస్కులు 

కూటమి రాజకీయంలో బలమైన కన్వీనర్ ఉంటే, సంక్షోభ సమయాల్లో లేదా చిన్న పార్టీల డిమాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. వాజ్‌పేయీ హయాంలో జార్జ్ ఫెర్నాండెజ్ వంటి నాయకులు విభేదాలను సర్దుబాటు చేయడంలో సఫలమైనప్పటికీ, అప్పట్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. కానీ ఇప్పుడు బీజేపీ కూటమిలో ప్రధాన భాగస్వామిగానూ, ప్రభుత్వం నడిపే ప్రధాన శక్తిగానూ ఉంది. విధానపరమైన డీల్స్, సీట్ల సర్దుబాటు లేదా కేబినెట్ విస్తరణ వంటి సున్నితమైన అంశాలను హైకమాండే స్వయంగా హ్యాండిల్ చేయడానికి మొగ్గు చూపుతుంది.

 ప్రస్తుత ప్రచారం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? 

ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వచ్చే ఈ తరహా వార్తలు చాలా వరకు ఊహాగానాలు లేదా చిన్న పార్టీల శ్రేణులు విడుదల చేసే ట్రయల్ బెలూన్స్  గానే భావించాలి. కూటమిలో తాము కూడా భాగస్వాములం అనే సందేశాన్ని మీడియా ద్వారా బయటకు పంపడానికి లేదా కూటమి పార్టీలను సంతృప్తిపరచడానికి ఇలాంటి వార్తలు తెరపైకి వస్తుంటాయి. అయితే, బీజేపీ అధిష్టానం వద్ద మాత్రం కన్వీనర్ వ్యవస్థను మళ్లీ అధికారికంగా పునరుద్ధరించే ఆలోచన ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కోసం ఒక సజావు వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తోంది. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఉమ్మడి వ్యూహాల రూపకల్పన, అప్పుడప్పుడు ఏర్పాటు చేసే ఎన్డీఏ ఎంపీల లేదా భాగస్వామ్య పక్షాల సమావేశాల ద్వారా కమ్యూనికేషన్ నిరంతరం జరుగుతోంది. అంతేకాకుండా, కేంద్ర కేబినెట్‌లో భాగస్వామ్య పార్టీల నేతలకు స్థానం కల్పించడం ద్వారా ప్రభుత్వం స్థాయిలోనే నేరుగా చర్చలు సాగుతున్నాయి.
  
సారూప్య ఆలోచనలు కలిగిన పార్టీలతో నడుస్తున్న ప్రస్తుత ఎన్డీఏలో పాత తరహా  కన్వీనర్ వ్యవస్థ అవసరం కంటే, నేరుగా అగ్రనాయకత్వాల మధ్య నడిచే  డైరెక్ట్ కమ్యూనికేషన్  విధానమే బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు లేదా నితీష్‌లకు కన్వీనర్ పదవి కట్టబెడతారనే ప్రచారం రాజకీయంలో ఒక నిరంతర చర్చగా మాత్రమే మిగిలిపోతుందే తప్ప, ఆచరణ రూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువ.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget