అన్వేషించండి

Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !

ప్లేయర్లకు జిమ్ ఫిట్‌నెస్ కంటే మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యమని, పదే పదే గాయాలు కావడానికి లోపభూయిష్టమైన ట్రెయినింగ్ పద్ధతులే కారణమని సునీల్ గవాస్కర్ తెలిపాడు.

Sunil Gavaskar Questions Fitness Culture:  ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా వంటి కీలక ప్లేయర్లు వరుసగా గాయాలపాలవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) పై విమర్శలు వస్తున్న వేళ, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రంగంలోకి దిగాడు. సీఓఈ ఫిజియోలను నిందించడం సరైంది కాదని, అసలు లోపం ప్లేయర్ల ట్రెయినింగ్ పద్ధతుల్లోనే ఉందని గవాస్కర్ కుండబద్దలు కొట్టాడు. ఆటగాళ్లు జిమ్ ఫిట్‌నెస్ కంటే మ్యాచ్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మిడ్-డే కాలమ్‌లో రాసుకొచ్చాడు.

హామ్‌స్ట్రింగ్ గాయాలు.. జిమ్ ఫిట్ వర్సెస్ మ్యాచ్ ఫిట్
"బుమ్రాకు మోకాలి సమస్య ఉండగా, చాలా మంది ఇండియన్ ప్లేయర్లు హామ్‌స్ట్రింగ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వారి ట్రెయినింగ్ విధానంలోనే ఏదో లోపం ఉంది కాబట్టే ఇలాంటి గాయాలు మళ్లీ మళ్లీ అవుతున్నాయి. వీరంతా ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు గాయపడుతున్నారు, కానీ నింద మాత్రం సీఓఈ ఫిజియోలపై వేస్తున్నారు. జిమ్ ఫిట్ కావడం కంటే మ్యాచ్ ఫిట్ కావడం చాలా ముఖ్యం. బహుశా ఫిట్‌నెస్ విషయంలో విభిన్న ఆలోచనలు ఉన్న తరం నుంచి నేను వచ్చి ఉండవచ్చు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.

Read Also: IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్.. 

బయోమెకానిక్స్ రూల్స్.. ఐపీఎల్ నెట్ ప్రాక్టీస్ పై విమర్శలు
నెట్ ప్రాక్టీస్ లో బౌలర్లపై విధిస్తున్న పరిమితులను గవాస్కర్ ప్రశ్నించాడు. "బయోమెకానిక్స్ పేరుతో ప్రాక్టీస్ నెట్స్‌లో బౌలర్లు ఇన్ని బంతులు మాత్రమే వేయాలనే నిబంధన సరికాదు. ఐపీఎల్ లో కొంతమంది విదేశీ ఫిజియోలు నెట్స్‌లో బౌలర్లను 20 బంతుల కంటే ఎక్కువ వేయనివ్వడం లేదని తెలిసింది. మ్యాచ్ లో నో-బాల్స్, వైడ్లు లేకుండా కనీసం 24 బంతులు వేయాల్సి వచ్చినప్పుడు, నెట్స్‌లో తక్కువ బంతులు వేయడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది?" అని నిలదీశాడు. ఇలాంటి నిబంధనల వల్ల ప్లేయర్ల సహజ సామర్థ్యం దెబ్బతింటుందని విశ్లేషించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్, 2027 వరల్డ్ కప్ సన్నాహాలకు ఎదురుదెబ్బ
బుమ్రా, హార్దిక్ లాంటి మ్యాచ్ విన్నర్లు తరచూ గాయాల పాలవ్వడం డబ్ల్యూటీసీ (WTC) 2027 ఫైనల్ రేసుతో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ సన్నా హాలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఈ గాయాల సమస్యను సీరియస్ గా తీసుకుని ట్రెయినింగ్ పద్ధతులను సరిదిద్దాల్సిన సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ముఖ్యమైన మ్యాచ్ లకు కీలక ఆటగాళ్లు దూరం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జట్టు ఫిజియో తో కూడా బీసీసీఐ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తుందని వార్తలు వెలువడ్డాయి.  

Read Also: Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Arshdeep, Tilak Historic Record: భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Vizianagaram ZP Elections: మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
మజ్జి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ ఫిర్యాదు.. చిన్న శ్రీనుకు పెద్ద టెన్షన్- మరోవైపు బొత్సకు షాక్!
Embed widget