అన్వేషించండి

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..

గాలే టెస్ట్ రెండో రోజు వర్షం అంతరాయం కలిగించినా దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 460 రన్స్ చేసింది.

Devdutt Padikkal Powers India Galle Test:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి రోజు ఇండియా భారీ స్కోరు దిశగా సాగగా, రెండో రోజు ఉదయం నుంచి భారీ వర్షం కారణంగా దాదాపు ఐదు గంటల పాటు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం 2:35 గంటలకు ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత భారత్ భారీ స్కోరు సాధించింది. ఆదివారం రెండో రోజు ఆట‌ముగిసేస‌రికి  116 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 460 ప‌రుగులు చేసింది. లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు కుల్దీప్ యాద‌వ్ (12), ప్ర‌సిధ్ కృష్ణ (1) క్రీజులో ఉన్నారు. ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌కు నాలుగు వికెట్లు ద‌క్కాయి. రెండో రోజు శ్రీలంక బౌలర్లు కొత్త బంతితో ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. తొలి 90 నిమిషాల వ్యవధిలోనే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వికెట్లు తీసి పర్యాటక జట్టుపై ప్రెజర్ క్రియేట్ చేశారు.

పడిక్కల్ డబుల్ సెంచరీ మిస్.. జయసూర్య, నువాంత దెబ్బ
ఇక ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికి లంక అరంగేట్ర బౌలర్ కేశర నువాంత పిచ్ నుంచి వచ్చిన టర్న్, బౌన్స్ ను అద్భుతంగా వాడుకుంటూ ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రిషభ్ పంత్ (39) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోగా, రిటైర్డ్ హ‌ర్ట్ హ‌ర్ట్ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కేఎల్ రాహుల్ (82) షార్ప్ టర్న్ బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (13)ను కూడా త్వరగానే అవుట్ చేశారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత క్లాస్ తో బ్యాటింగ్ చేశాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన పడిక్కల్ 167 రన్స్ చేసి లంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ.. మానవ్ సుతార్ తో కీలక భాగస్వామ్యం
జడేజా అవుటైన తర్వాత స్కోరు 377/6 వద్ద ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (51) ధాటిగా ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆశించినట్లుగానే లోయర్ ఆర్డర్ లో మానవ్ సుతార్ (24)తో కలిసి 55 రన్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వేగంగా ఆడుతూ 51 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జురెల్, జట్టు స్కోరును 400 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. జయసూర్య బౌలింగ్ లో జురెల్ అవుట్ అయినా, జట్టుకు కావాల్సిన పటిష్ట స్థితిని అందించాడు.

వర్షం అంతరాయాలు.. 
ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో గ్రౌండ్ స్టాఫ్ సూపర్ సాపర్ల సహాయంతో శ్రమించి గ్రౌండ్ ను సిద్ధం చేశారు. కేశర నువాంత 3 వికెట్లు పడగొట్టారు. రాబోయే రోజుల్లోనూ వర్షం పడే అవకాశాలు ఉన్నప్పటికీ, గాలే పిచ్ స్పిన్ కు పూర్తి స్థాయిలో అనుకూలిస్తుండటంతో ఇండియన్ స్పిన్నర్లు రంగంలోకి దిగితే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Embed widget