అన్వేషించండి

Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!

సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకుని వచ్చినా దేవదత్ పడిక్కల్ నే నంబర్ 3 స్థానంలో కొనసాగించాలని సంజయ్ మంజ్రేకర్ టీమ్ యాజమాన్యాన్ని కోరాడు. తొలి టెస్టులో అజేయ సెంచరీతో పడిక్కల్ రాణించాడు.

Padikkal Fit For Number Three:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే శతకంతో మెరిసిన యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమవ్వడంతో జట్టులోకి వచ్చిన పడిక్కల్, తొలి రోజే 131 పరుగులతో అజేయంగా నిలిచి భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ, సుదర్శన్ రీ-ఎంట్రీ ఇచ్చినా పడిక్కల్ నే నంబర్ 3 స్థానంలో కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ కు సూచించాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో పడిక్కల్ టెక్నిక్ ఇండియాకు దేవుడిచ్చిన వరం లాంటిదని అతడు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నాడు.

Read Also: IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!

స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం.. బ్యాక్ ఫుట్ షాట్ల మేజిక్
తాజాగా ఓ చానెల్లో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్, పడిక్కల్ షాట్ సెలెక్షన్ ను కొనియాడాడు. "పడిక్కల్ రూపంలో ఇండియాకు పెద్ద మార్పు లభించింది. స్పిన్ బౌలింగ్ ను అతడు ఎంత సులభంగా ఎదుర్కొంటున్నాడో చూస్తే సెలెక్షన్ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. స్పిన్ ను డిఫెన్స్ చేయడంలోనే కాకుండా ఫీల్డర్లు వెనక్కి వెళ్లినప్పుడు సింగిల్స్, డబుల్స్ తీయడంలోనూ అతడు మంచి నేర్పు కనబరిచాడు. స్లో, టర్నింగ్ పిచ్ లపై బ్యాక్ ఫుట్ తో అటాకింగ్ షాట్లు ఆడటం అద్భుతమైన విషయం. స్లో ట్రాక్స్ పై ఎక్కువ బంతులను బ్యాక్ ఫుట్ లో ఆడటమే స్పిన్ ను ఎదుర్కొనే సరైన పద్ధతి" అని వివరించాడు.

Read Also: Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్

ముందుకు వచ్చి కొట్టే సత్తా.. నంబర్ 3 స్థానానికి పూర్తి అర్హుడు
పడిక్కల్ కేవలం బ్యాక్ ఫుట్ కే పరిమితం కాకుండా క్రీజు వదిలి ముందుకు వచ్చి స్ట్రెయిట్ గా సిక్సర్లు కొట్టగలడని మంజ్రేకర్ చెప్పాడు. "స్పిన్ కు ఎక్కువ అనుకూలత ఉండే పిచ్ లపై సాయి సుదర్శన్ తిరిగి వచ్చినా పడిక్కల్ నే నంబర్ 3 లో ఆడించాలి. ఎందుకంటే స్పిన్నర్ల బౌలింగ్ లో అతడు ఎంతో ప్రమాదకరమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడి వద్ద ఉన్న స్పిన్ టాలెంట్ వల్ల నంబర్ 3 స్థానంలో అతడు జట్టుకు లభించిన ఒక గొప్ప ఆస్తి" అని తెలిపాడు.

131 రన్స్ నాటౌట్.. పడిక్కల్ జోరుతో భారత్ పటిష్టం
26 ఏళ్ల పడిక్కల్ తొలి టెస్ట్ సెంచరీ సాధించి భారత జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. టాప్ ఆర్డర్ లో అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల జట్టుకు స్థిరత్వం లభించింది. శ్రీలంక స్పిన్నర్ల ఎటాక్ ను అలవోకగా తిప్పికొడుతూ అతడు ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే మ్యాచ్ లలో అతడి స్థానం మరింత సుస్థిరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆదివారం రెండో రోజు వ‌ర్షం కార‌ణంగా ఆట ప్రారంభం కాలేదు. వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఎర్లీ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. తొలిరోజు ఆట ముగిసేస‌రికి 73 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 288 ప‌రుగుల‌ను భార‌త్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Bhuvi Return Debate: ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్
ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్, షమీ సిరాజ్‌లను పక్కనబెట్టడంపై తీవ్ర అసహనం
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget