అన్వేషించండి

IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!

గాలే టెస్ట్ తొలి రోజు దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ కొట్టగా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Devdutt Padikkal Hundred Puts India Ahead vs SL: శ్రీలంకతో గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే ఇండియన్ బ్యాటర్లు అద్భుత ఆధిపత్యం చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, వర్షం కారణంగా 73 ఓవర్లకే పరిమితమైన ఆట శ‌నివారం తొలిరోజు ఆట‌ముగిసేస‌రికి  2 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది. నంబర్ 3 స్థానంలో వచ్చిన యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సూప‌ర్బ్ అజేయ‌ సెంచ‌రీ (178 బంతుల్లో 131 బ్యాటింగ్, 12 ఫోర్లు, 1 సిక్స‌ర్ ) తో స‌త్తా చాటాడు. దీంతో నంబర్ 3 పొజిషన్ లో దాదాపు 20 టెస్టుల తర్వాత ఇండియా తరఫున ఒక బ్యాటర్ సెంచరీ కొట్టడం విశేషం. బౌల‌ర్ల‌లో ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌కు ఒక వికెట్ ద‌క్కింది. 

జైస్వాల్ రనౌట్.. రాహుల్ తో కలిసి పడిక్కల్ 150 రన్స్ భాగస్వామ్యం

అంత‌కుముందు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32) , కేఎల్ రాహుల్ (77 రిటైర్డ్ హ‌ర్ట్) శుభారంభం అందించారు. వీరిద్ద‌రూ మంచి జోరు క‌న‌బ‌ర్చ‌డంతో భార‌త్ తొలి వికెట్ కు 47 ప‌రుగులు జోడించింది. అయ‌తే సాఫీగా సాగుతున్న ఈ జంట‌ సమన్వయ లోపం కారణంగా జైస్వాల్, రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ తో కలిసి శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు ఏకంగా 150 రన్స్ పార్ట్‌నర్‌షిప్ జోడించాడు. రాహుల్ క్లాసిక్ షాట్లతో 77 రన్స్ చేసి మంచి ఫామ్ లో కనిపించిన సమయంలో ఫోర్ ఆర్మ్ కండరాల పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. ఆఖరి సెషన్ లో రాహుల్ బ్యాటింగ్ కు రాకపోవడం టీమ్ ను కాస్త ఆందోళనకు గురిచేసింది.

గిల్ ని నిలువరించిన జయసూర్య.. పంత్ తో కలిసి పడిక్కల్ జోరు
ఇక రాహుల్ వెనుదిరిగిన త‌ర్వాత , కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 16 రన్స్ మాత్రమే చేసి శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (27 బ్యాటింగ్) తో కలిసి పడిక్కల్ చివరి 40 నిమిషాల పాటు లంక స్పిన్ అటాక్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పిచ్ నుంచి బంతి టర్న్ అవుతున్నప్పటికీ ఇద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. వీరిద్ద‌రూ అజేయమైన మూడో వికెట్ కు 52 ప‌రుగులు జోడించారు.

గాలే పిచ్ పై టర్న్.. శ్రీలంకకు డేంజర్ బెల్స్
తొలి రోజే పిచ్ పై స్పిన్నర్లకు అద్భుతమైన టర్న్ లభించడం శ్రీలంక జట్టును కలవరపెడుతోంది. ఇండియా కేవలం 73 ఓవర్లలోనే 287 రన్స్ వేగంగా జోడించడంతో భారీ ఆధిక్యం సాధించే అవకాశం దక్కింది. రాబోయే రోజుల్లో పిచ్ మరింతగా టర్న్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఇండియా స్పిన్నర్లకు ఇది బిగ్ అడ్వాంటేజ్ గా మారనుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Masterclass Secret Revealed: ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Bhuvi Return Debate: ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్
ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్, షమీ సిరాజ్‌లను పక్కనబెట్టడంపై తీవ్ర అసహనం
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget