అన్వేషించండి

Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా

Devdutt Padikkal Century: శ్రీలంకపై గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ శతకంతో రాణించాడు. టెస్ట్ క్రికెట్‌లో పడిక్కల్‌కు ఇది తొలి శతకం కాగా, రికార్డులు తిరగరాశాడు.

గాలే: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్ట్ మొదటి రోజున దేవదత్ పడిక్కల్ అద్భుతం చేశాడు. టీమ్ ఇండియా తరఫున నంబర్-3గా వచ్చిన దేవదత్ పడిక్కల్ 134 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో దేవదత్ పడిక్కల్‌కు ఇది తొలి శతకం కావడంతో అతడి కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఇదీ. ఈ తొలి శతకంతోనే పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. 

చరిత్ర సృష్టించిన దేవదత్ పడిక్కల్

శ్రీలంకపై తొలి టెస్టులో శతకం బాది దేవదత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. పడిక్కల్ 21వ శతాబ్దంలో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. 2002లో ఢిల్లీలో జింబాబ్వేపై 136 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత, దేవదత్ పడిక్కల్ 21వ శతాబ్దంలో భారత్ తరఫున నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ సెంచరీ చేసిన రెండో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పడిక్కల్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. 

ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేసిన పడిక్కల్

ఇంతకుముందు శ్రీలంక ఎలెవన్‌పై కూడా దేవదత్ పడిక్కల్ నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ అద్భుత సెంచరీ సాధించాడు. 3 రోజుల వార్మప్ మ్యాచ్‌లో దేవదత్త పడిక్కల్ 164 బంతుల్లో 142 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

భారత్ తరఫున నంబర్ స్థానంలో సెంచరీ చేసిన లెఫ్ట్ హ్యాండర్లు వీరే 
ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ వినోద్ కాంబ్లీ 4 సెంచరీలతో జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 3 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దేవదత్ పడిక్కల్ టెస్టు సెంచరీతో ఒక్క సెంచరీ చేసిన ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. 

-  4 సెంచరీలు - వినోద్ కాంబ్లీ
-  3 సెంచరీలు - సౌరవ్ గంగూలీ
-  1 సెంచరీ - సలీమ్ దురానీ, బాపు నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏకనాథ్ సోల్కర్, సురీందర్ అమర్‌నాథ్, దేవదత్ పడిక్కల్.


19 టెస్టుల తర్వాత నంబర్-3లో టీమిండియా తరఫున సెంచరీ
నంబర్ 3లో బ్యాటింగ్‌కు దిగి టెస్టుల్లో సెంచరీ చేసిన చివరి భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్. కెప్టెన్ గిల్ సెప్టెంబర్ 2024లో చెన్నైలో బంగ్లాదేశ్‌పై ఈ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌కు, ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్‌కు మధ్య జరిగిన 19 టెస్టుల్లో భారత్ వన్ డౌన్ బ్యాటర్ అంటే మూడో నంబర్‌లో ఏడుగురు వేర్వేరు బ్యాటర్లను ప్రయోగించారు. వీరందరూ కలిపి మొత్తం 35 ఇన్నింగ్స్‌ల్లో 27.28 సగటుతో పరుగులు చేశారు. ఈ వన్‌డౌన్ బ్యాటర్లు ఐదుసార్లు 50కి పైగా స్కోరు చేశారు. 19 టెస్టుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు  పడిక్కల్ వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించాడు.

2 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన దేవదత్ పడిక్కల్ 2 ఏళ్ల తర్వాత టెస్టు ఫార్మాట్‌లోకి కం బ్యాక్ చేశాడు. అంతకుముందు పడిక్కల్ భారత్ తరఫున నవంబర్ 2024లో చివరి టెస్టును  ఆడాడు. అందులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 0, 25 పరుగులు చేశాడు. సుదీర్ఘకాలం తర్వాత టెస్టు జట్టు నుంచి పిలుపు రాగా, అందివచ్చిన అవకాశాన్ని పడిక్కల్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. దాంతో మాజీ క్రికెటర్లు, జట్టు సహచరులు, కోచ్ పడిక్కల్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తున్నారు.

మొదటి టెస్టు తొలిరోజు భారత్ ఆధిపత్యం

గాలేలో జరుగుతున్న మొదటి టెస్టులో ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పడిక్కల్ సెంచరీ తరువాత వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. భారత జట్టు అప్పటివరకు రెండు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 147 బంతుల్లో 107 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 9 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతనితో పాటు రిషభ్ పంత్ 7 బంతుల్లో మూడు పరుగులతో ఉన్నాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ 32, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. వర్షం ఆగడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. మూడో సెషన్ నడుస్తోంది. మరో వికెట్ పడకుండా పడిక్కల్, పంత్ పరుగులు సాధిస్తున్నారు. పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget