అన్వేషించండి

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

Free Bus For Women In AP: ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించి ముచ్చటించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్త్రీశక్తి ఉచిత బస్ పథకం ఏడాది పూర్తి, సీఎం మహిళలతో ప్రయాణం.
  • పథకంతో మహిళలకు నెలకు రూ.4000 వరకు ప్రయాణ ఖర్చులు ఆదా.
  • ఏడాదిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు; మహిళల వాటా 62%కి చేరింది.

Free Bus For Women In AP: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో గతేడాది సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. 

Image

రాయపూడి నుంచి క్యాంప్ కార్యాలయం వరకు... 

విజయవాడలోని పరేడ్ గ్రౌండ్స్‌ నుంచి సీడి యాక్సెస్‌ రోడ్డు మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ముఖ్యమంత్రి మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముచ్చటించారు. పథకం ద్వారా వారికి కలుగుతున్న లబ్ధి, పొదుపు అవుతున్న నగదు గురించి ఆరా తీశారు. 

Image

చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక మహిళ, స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు 4000 వరకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయని వెల్లడించింది. ఈ పొదుపుతో తన ఆరోగ్య అవసరాలకు మందుల కొనుగోలు చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన సీఎం, ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే సంపాదనను మరింత పొదుపు చేసుకోవచ్చని సూచించారు. 

నంద్యాల నుంచి వచ్చిన ఒక ముస్లిం మహిళ, ఉచిత బస్ ద్వారా తనకు నెలకు 1500 ఆదా అవుతోందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళ మాట్లాడుతూ, ముడి సరకు తేవడానికి, నేసిన చీరలు మార్కెట్‌కు చేరవేయడంలో ఈ పథకం తమకు వరంగా మారిందని తెలిపింది. గతంలో కేవలం భర్త మాత్రమే వ్యాపార పనులకు వెళ్లే వారని ఇప్పుడు తాము కూడా వెళ్తున్నామని ఇది ఆనందాన్నిచ్చిందని తెలిపింది. 

Image

పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదైనట్టు సీఎం తెలిపారు. సగటున రోజుకు 24 లక్షల మంది ఈ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీలోని మత్తం 9, 978 బస్సుల్లో 7,631 బస్సుల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సులు ఉన్నాయి. 

Image

గతంలో బస్‌ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతంగా ఉండగా, ఈ పథకం అమలు తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ఈ పథకం వల్ల రహదారి ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

Frequently Asked Questions

స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం ఎంతకాలం పూర్తి చేసుకుంది?

ఈ పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఇది మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో గతేడాది ఇదే రోజున ప్రారంభమైంది.

స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు నమోదైన ఉచిత ప్రయాణాలు ఎన్ని?

పథకం ప్రారంభమైన నాటి నుంచి రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. సగటున రోజుకు 24 లక్షల మంది మహిళలు దీని ద్వారా ప్రయాణిస్తున్నారు.

స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం ఏయే కేటగిరీ బస్సుల్లో అందుబాటులో ఉంది?

ఏపీఎస్‌ఆర్టీసీలోని 7,631 బస్సుల్లో ఈ పథకం అమలు అవుతోంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సులు దీనిలో భాగం.

స్త్రీశక్తి పథకం అమలుతో మహిళల ప్రయాణ వాటాలో వచ్చిన మార్పు ఏమిటి?

ఈ పథకం అమలు తర్వాత బస్‌ ప్రయాణాల్లో మహిళల వాటా గతంలో 40% ఉండగా, అది ఇప్పుడు 62%కి పెరిగింది. ఇది రహదారి ప్రమాదాల తగ్గింపునకు కూడా దోహదపడింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget