అన్వేషించండి

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్

స్వాతంత్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ సెంచరీ సాధించి విరాట్ కోహ్లీ సరసన నిలిచిన దేవదత్ పడిక్కల్, తొలి టెస్ట్ శతకంతో రికార్డు సృష్టించాడు.

Devdutt Padikkal Hits Milestone Test Century: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. రెగ్యులర్ నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్ గాయంతో దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తన కెరీర్ లోని మూడో టెస్టులోనే తొలి సెంచరీ సాధించాడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు అంతర్జాతీయ సెంచరీ బాదిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా కింగ్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అయితే కోహ్లీ వన్డేల్లో ఈ ఫీట్ సాధించగా, టెస్ట్ ఫార్మాట్ లో ఇండిపెండెన్స్ డే నాడు సెంచరీ కొట్టిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కోహ్లీ రేర్ రికార్డు సమం.. 147 బంతుల్లోనే అజేయ శతకం
గతంలో విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆగస్టు 15న 99 బంతుల్లో 114 రన్స్ నాటౌట్ గా కొట్టాడు. రిపబ్లిక్ డే (2012 లో ఆస్ట్రేలియాపై 116), ఇండిపెండెన్స్ డే రెండింటిలోనూ సెంచరీలు కొట్టిన ఏకైక భారతీయ బ్యాటర్‌గా కోహ్లీ ఉన్నాడు.  పడిక్కల్, గాలే టెస్టులో 178 బంతుల్లో 131 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో స‌త్తా చాటాడు ఇందులో 12 ఫోర్లు, 1 సిక్స‌ర్ ఉండ‌టం విశేషం. దీంతో నంబర్ 3 స్లాట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.

నంబర్ 3 కోసం 19 టెస్టుల నిరీక్షణ.. పడిక్కల్ డ్రీమ్ రన్
2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టిన తర్వాత, నంబర్ 3 స్థానంలో ఇండియాకు శతకం రాలేదు. ఆ తర్వాత జరిగిన 19 టెస్టుల్లో ఇండియా ఏడుగురు వేర్వేరు బ్యాటర్లను ప్రయత్నించినా వారి ఉమ్మడి సగటు కేవలం 27.28 మాత్రమే ఉంది. పడిక్కల్ సెంచరీతో ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తన గత 7 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో పడిక్కల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 87.75 సగటుతో 702 రన్స్ బాదాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రంజీల్లో పంజాబ్‌పై 120, ఉత్తరాఖండ్‌పై 232, శ్రీలంక-ఎ పై 94 రన్స్ కొట్టి సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.

రాహుల్ తో 150 రన్స్ పార్ట్‌నర్‌షిప్.. పంత్ తో కలిసి క్రీజులో
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా, యశస్వి జైస్వాల్ (32) వికెట్ కోల్పోయాక కేఎల్ రాహుల్ (77), పడిక్కల్ కలిసి రెండో వికెట్‌కు 150 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగగా, గిల్ 16 రన్స్ మాత్రమే చేశాడు. వర్షం కారణంగా 73 ఓవర్లకే పరిమితమైన ఆటలో శ‌నివారం తొలిరోజు ఆట‌ముగిసేస‌రికి  2 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది. పడిక్కల్ సెంచరీ ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Rohit Sharma Record: అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget