అన్వేషించండి

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!

డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి కంగారూల గడ్డపై బంగ్లాదేశ్ తమ తొలి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Bangladesh Stuns Australia Down Under: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డార్విన్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ లో కంగారూలను 9 వికెట్ల తేడాతో బంగ్లా టైగర్స్ చిత్తు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హసన్ మహ్ముద్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా కేవలం 198 రన్స్ కే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ 71 రన్స్ తో ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదు.

తాంజిద్ హసన్ సెంచరీ మేజిక్.. బంగ్లాదేశ్ కు భారీ లీడ్
తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. తన కెరీర్ లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న తాంజిద్ హసన్ తమీమ్ 101 రన్స్ తో అద్భుత సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా మోమినుల్ హక్ (49), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంతో (84), మెహిదీ హసన్ మిరాజ్ (65) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 426 రన్స్ బోర్డుపై పెట్టింది. దీంతో పర్యాటక జట్టుకు ఏకంగా 228 రన్స్ భారీ ఆధిక్యం లభించింది.

కామెరాన్ గ్రీన్ పోరాటం వృథా.. 57 రన్స్ టార్గెట్ తో సునాయాస ఛేజింగ్
సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ తడబడింది. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 201 బంతుల్లో 104 రన్స్ తో సెంచరీ చేసి పరువు కాపాడటంతో ఆసీస్ 284 రన్స్ చేయగలిగింది. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 రన్స్ ఈజీ టార్గెట్ మాత్రమే మిగిలింది. మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటాడు నాలుగో రోజు బరిలోకి దిగిన బంగ్లాదేశ్, తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో, ఓపెనర్ తాంజిద్ హసన్ గోల్డెన్ డక్ గా అవుటైనా ఆ తర్వాత ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మోమినుల్ హ‌క్ (30 నాటౌట్), షాద్ మాన్ ఇస్లాం (25 నాటౌట్) అజేయంగా నిలిచి, జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. 

టెస్ట్ సిరీస్ పై బంగ్లా కన్ను.. చరిత్ర తిరగరాసిన టైగర్స్
గతంలో 2017 లో స్వదేశంలో వెట‌ర‌న్ ప్లేయ‌ర్ షకీబ్ అల్ హసన్ 10 వికెట్లు, 89 రన్స్ ఆల్ రౌండ్ షోతో మిర్పూర్ లో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ ఒకసారి ఓడించింది. కానీ ఆసీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 7 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఐదు గెలవగా, ఒకటి డ్రా అయింది, తాజా మ్యాచ్ తో బంగ్లాదేశ్ ఒక విక్టరీ నమోదు చేసింది. ఈ జోరుతో ఆస్ట్రేలియాపై తమ తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోవాలని బంగ్లాదేశ్ పట్టుదలతో ఉంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ కు ముందు బంగ్లాను తేలికగా తీసుకుని ఆసీస్ మూల్యం చెల్లించుకుంది. ఉప‌ఖండ‌పు వాతావ‌ర‌ణం ఉండే డార్విన్ లో ఈ మ్యాచ్ షెడ్యూల్ చేయ‌డంతో, బంగ్లా రెచ్చిపోయింది. అంత‌కుముందు ప్రాక్టీస్ మ్యాచ్ లో క్ల‌బ్ స్థాయి బౌల‌ర్ల చేతిలో బంగ్లా 54 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డం కూడా ఆసీస్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించేందుకు దోహ‌ద ప‌డింది. ఓవ‌రాల్ గా తొలి టెస్టులో మాత్రం అంచ‌నాల‌కు మించి, వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ఆసీస్ ను త‌న సొంత‌గ‌డ్డ‌పై వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 9 బంగ్లా ఓడించి సంచ‌ల‌నం సృష్టించింది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Bilateral Revenue War: వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget