అన్వేషించండి

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

టెక్ మహీంద్రా ఉద్యోగి భావన తనను ఉద్యోగం నుండి అన్యాయంగా తొలిగించారంటూ ఇటీవల న్యాయపోరాట చేస్తూ వార్తల్లో నిలిచారు. తాజాగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై ABP దేశంతో స్పందిచారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కుమార్తె వైద్య సెలవుతో మొదలై, ఐటీ ఉద్యోగుల పోరాటంగా మారింది.
  • విమర్శలను పట్టించుకోకుండా, కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ స్థాపన లక్ష్యం.
  • పరిహారాన్ని తోసిపుచ్చి, ఆరు డిమాండ్ల నెరవేర్పుకే ఆమె పోరాటం.
  • అన్యాయమైన కంపెనీ నిబంధనలను వ్యతిరేకిస్తూ, తల్లిదండ్రులపై వ్యాఖ్యలు ఖండించింది.

ABP దేశం: 

సోషల్ మీడియాలో మీకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా నెగిటిగివ్ కామెంట్స్ పెడుతున్నవారు ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ పై మీ స్పందన ఏంటి.

మీ ఆవేదన మీ ఫ్యామిలీ గురించి మొదలైయ్యింది. ఆ తరువాాత మీ మనోభావాలు అంటున్నారు. ఇప్పుడేమో ఐటీ ఉద్యోగుల కోసం నా పోరాట అంటున్నారు. ఇంతకీ ఎవరికోసం మీ న్యాయపోరాటం..

భావన, టెక్ మహీంద్రా ఉద్యోగి:

ఆ మెసేజ్ కోపంతో పెట్టలేదు. ప్రేమతో వాళ్లు కామెంట్స్ చేశారు. మొదట మా పాప కోసం చేసినప్పుడు అది కేవలం జస్ట్ మెడికల్ ఎమర్జెన్సీ లీవ్. నాకు తెలియలేదు ఇంత ఆందోళన చేయాల్సి వస్తుందని, ఇంత దూరం వెళుతుందని నేను అనుకోలేదు. కామెంట్స్ పెట్టేవారు, నాకు సపోర్ట్ చేసేవారు నాతో రాకపోవచ్చు, కానీ ఒక్క నిమిషమైనా వాళ్లు అనుకుంటారు కదా. నా మేనేజర్ కూడా ఇలా ఉంటే నా పరిస్దితి ఏంటని. అది చాలు. మొదటి నుండీ నేను  చెబుతున్నది ఒక్కటే. ఉద్యోగులపై ఐటీ కంపెనీల వేధింపుల గురించే నేేను మాట్లడుతున్నాను. కానీ మీడియా మాత్రం నా ఉద్యోగం సమస్య గురించే ఎక్కువ హైలెట్ చేస్తున్నారు. ఆమె జాబ్ కోల్పోయింది, ఆమెను జాబ్ లోకి తీసుకుంటారా లేదా అనే విషయాలు గురించే మాట్లాడుతున్నారు. 

అవమానం జరిగిన చోటికి తిరిగి వెళ్లాలని లేదు. కాబట్టి ఆఫీసులొ పనిచేయాలా వద్దా అనేది నా నిర్ణయం మాత్రమే. ఈ జాబ్  వదలుకుందామని అనుకుంటే నేను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం పొందాను. ఇప్పుడు జాబ్ అప్లయ్ చేసినా నాకు జాబ్ దొరకదు. ఈరోజు నా ఈ పరిస్దితికి టెక్ మహీంద్రా కారణం కాబట్టి, ప్రాణత్యాగం అయినా చేస్తాను తప్ప వాళ్లను వదలిపెట్టను. 

నేను సెలవులు తీసుకున్నరోజు మా అమ్మ, నాన్న ఉండి ఉంటే, మా పాను అమ్మే చూసుకునేది. అమ్మా నాన్న కూాడా వాళ్ల పనిలో వాళ్లు బిజీగా ఉంటారు కాదా. నా తమ్ముడిని కూడా వాళ్లు చూసుకోవాలి కదా. వాళ్లకు వాళ్ల నులు ఉన్నాయి. నేను రెగ్యూలర్ గా మీడియా హౌసెస్ కు వెళ్లడం లేదు. ఐటీ ఉద్యోగుల కోసం కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ పెడుతున్నాము, ఆ పనిలో ఉన్నాను. మా పాపను ఇప్పుడూ, అప్పుడూ నేనే చూసుకున్నాను. చూసుకుంటున్నాను. 

ABP దేశం: 

ఐటీ ఉద్యోగుల సమస్యలు, ఐటీ కంపెనీల వేధింపులపై మీ డిమాండ్లు నెరవేరేలా కనిపించడంలేదు. మీరు ఇలా ఆందోళనలు చేసి ఐటీ ఇండస్ట్రీలో జోకర్ గా మిగిలిపోతారని అనిపిస్తోంది.

భావన, టెక్ మహీంద్రా ఉద్యోగి:

ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులను అడ్డుకునేందుకు నేను ఆందోళనలు మొదలు పెట్టాను. నా వల్ల మార్పు వచ్చినా, రాకపోయినా, నేను మొదటి మహిళగా కార్పొరేట్ కంపెనీ ముందు కూర్చుని నిరసన తెలిపాను. నేను ఒకవేళ ఐటీ ఇండస్ట్రీలో జోకర్ గా మిగిలిపోయినా నాకు పర్వాలేదు కానీ నా ఆందోళన ఆపను. 

ABP దేశం: 

మీ వీడియోలు చూస్తున్న , మీ మాటలు వింటున్న జనాలు ఎవరూ మీకు డబ్బులు ఇవ్వరు. దయచేసి మీ కంపెనీవాళ్లు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని, వేరే కంపెనీలో ఉద్యోగం చేసుకోండి. సగటు మధ్యతరగతి వ్యక్తిగా చెబుతున్నాను. మీరేమంటారు.

భావన, టెక్ మహీంద్రా ఉద్యోగి:

మీ సలహా నాకు చాలా బాగా నచ్చింది. కానీ వాళ్లు మంచి పరిహారం ఆఫర్ చేశారనే వార్తల్లో, ఊహాగానాల్లో వాస్తవం లేదు. నేను పెట్టిన ఆరు డిమాండ్లలో నాకు చెల్లించాల్సిన పరిహారం కూడా చివరి డిమాండ్ గా ఉంది. నా ఆరు డిమాండ్లు నెరవేరిన తరువాత, నేను నా ఫ్యామిలీని మాత్రమే చూసుకుంటాను. నన్ను ఎవరైనా  అడిగితే సహాయం చేస్తాను తప్ప, ఇతర విషయాల జోలికి వెళ్లను. నేను అజ్జాతంలోకి వెళ్లిపోతాను. 

ABP దేశం: 

మీరు ఉద్యోగంలో చేరే సమయంలోనే 20పేజీలతో ఉగ్యోగిగా మీరు అంగీకరించాల్సిన షరతులు పూర్తిగా చదవి మీరు సంతకం పెట్టే ఉంటారు. వాటిని అంగీకరించామని అప్పుడే ఒప్పుకున్నారు. అవన్నీ చదవకుండానే ఉద్యోగంలో చేరేటప్పుడు సంతకం పెట్టారా..

భావన, టెక్ మహీంద్రా ఉద్యోగి:

నాకు ఉద్యోగంలో చేరేటప్పుడు ఇచ్చిన పేపర్లలో నేను తిడితే పడతాను, వాష్ రూమ్ కు వెళ్లాలన్నా అనుమతి తీసుకుని వెళ్లాలనే షరతలు అంగీకరించినట్లు ఎక్కడా సంతాలు చేయలేదు. కంపెనీలో పేపర్ లో రాయనవి చాలా జరుగుతున్నాయి. అవి జరగకూడదని చెబుతున్నాాను. రెండు నెలలు ముందు వాళ్లు నన్ను తొలిగిస్తే వాళ్లు 2 నెలల జీతం ఇవ్వాలని, లేదా నేను రెండు నెలల నోటీస్ ఇవ్వకుండా వెళ్లితే నేను పరిహారం చెల్లించాలని షరతుల్లో ఉంది. నేను చూడకుండా ఎక్కడా సంతకాలు పెట్టలేదు. మా న్యాయవాదులు చట్టపరంగా ముందుకెళుతున్నారు.

ABP దేశం: 

ఇన్ని సంవత్సరాలు ఇంతలా ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే,  వేధింపులు ఉండే మీరు ఎందుకు బయటకు రాలేదు. ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది కాబట్టే బయటకు వచ్చి మాట్లాడుతున్నారా...

భావన, టెక్ మహీంద్రా ఉద్యోగి:

ఇంతకు ముందు పనిచేసిన కంపెనీ చాలా మంచి కంపెనీ. కానీ ఇప్పుడు చేస్తున్న కంపెనీలో ఉద్యోగులపై వేధింపులున్నాయంటూ జాబ్ లో చేరిన మొదట్లోనే చెప్పాను. నేను ట్రెండింగ్ అయిన వెంటనే , కంపెనీలో తప్పులపై చెబుతూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు పాత కంపెనీలో పనిచేశాను. లంగ్ డిజార్డర్ ఉంటే నాకు గతంలో  పాత కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఓ సర్జరీ జరిగింది. సర్జరీకి హెల్త్ కార్డ్ ఇచ్చాను. ఎమర్జెన్సీ ఫండ్ క్రింద డబ్బులు ఇచ్చారు. నా మేనేజర్ నన్ను చూడటానికి వచ్చారు. ఇలా చాలా మంచి కంపెనీలలో పనిచేశారు. అన్ని కంపెనీలు ఒకేలా ఉండవు. ఇప్పుడు నరకంలాంటి కంపెనీలో వచ్చి పడ్డాను.

ABP దేశం: 

మీది మానసిక పరిపక్వత లేని ఆలోచనలు, ఆవేశంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు సరిగా పెంచకపోతే ఇలాగే తయారవుతారని కామెంట్ చేస్తున్నారు. మీ సమాధానం ఏంటి..

భావన, టెక్ మహీంద్రా ఉద్యోగి:

నా మానసిక స్దితి బాగోలేదంటూ కామెంట్ పెట్టిన వ్యక్తి , నా మానసిక స్దితి బాగు చేసుకునేందుకు సైకిలాజికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వెళ్లి చూపించుకుంటాను. మా తల్లిదండ్రుల జోలికి వస్తే అది ఎవరైనా, ఎక్కడి వరకైనా వెళతాను. మా పాప ఆరోగ్యం బాగోకపోతే , నాకు సెలవు ఇవ్వలేదనే టెక్ మహీంద్రా వంటి పెద్ద సంస్దతో పోరాటం చేస్తున్నాను. నా తల్లిదండ్రుల జోలికి వస్తే , అది ఎవరైనా, ఎక్కడి వరకైనా వెళ్తా. దయచేసి నా తల్లిదండ్రులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ పెట్టొద్దు. నేను పద్దతిగా ఉన్న అమ్మాయిని , పద్దతిగా మాట్లడుతున్నాను కాబట్టే ఎక్కువశాతం మంది నాకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు చాలా తక్కువశాతం మంది ఉన్నారు. నేను వాళ్లను పట్టించుకోను. 

Frequently Asked Questions

మీ న్యాయపోరాటం ఎవరికోసం? మొదట పాప కోసం, ఇప్పుడేమో ఐటీ ఉద్యోగుల కోసం అంటున్నారు కదా?

మొదట తన పాప వైద్య అత్యవసర సెలవు కోసమేనని, అయితే ఇప్పుడు ఐటీ కంపెనీల వేధింపులపై ఉద్యోగుల కోసం పోరాడుతున్నానని భావన తెలిపింది. మీడియా తన ఉద్యోగం గురించే ఎక్కువ దృష్టి పెడుతోందని ఆమె పేర్కొంది.

మీరు ఐటీ ఇండస్ట్రీలో జోకర్‌గా మిగిలిపోతారని కొందరు అంటున్నారు కదా, దానిపై మీ స్పందన ఏమిటి?

జోకర్‌గా మిగిలిపోయినా పర్వాలేదని, తన ఆందోళన ఆపనని భావన బదులిచ్చింది. కార్పొరేట్ కంపెనీ ముందు నిరసన తెలిపిన మొదటి మహిళ తానేనని ఆమె పేర్కొంది.

కంపెనీ నుంచి మంచి పరిహారం తీసుకోమని ప్రజలు సలహా ఇస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

మంచి పరిహారం ఆఫర్ చేశారనే వార్తల్లో వాస్తవం లేదని భావన తెలిపింది. తాను పెట్టిన ఆరు డిమాండ్లలో పరిహారం కూడా ఒకటని, అవి నెరవేరిన తర్వాతే ఆలోచిస్తానని చెప్పింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Embed widget