అన్వేషించండి

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే

Indiramma Housing Scheme | కోర్ అర్బన్ రీజియన్‌లో 16 నియోజకవర్గాల్లో 60,014 దరఖాస్తులు రాగా, ఆగస్టు 20 తర్వాత లాటరీ వేయనున్నారు. మరో 4 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇందిరమ్మ ఇళ్లకు 60,014 దరఖాస్తులు; లాటరీ ద్వారా కేటాయింపు.
  • కొత్తగా నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తులు.
  • ఐదు లక్షల ఆర్థిక సహాయం, అన్ని మౌలిక వసతుల కల్పన.

Indiramma Double Bedroom Housing Scheme | హైదరాబాద్ నగర పరిధిలోని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి విశేష స్పందన లభించింది. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, CURE పరిధి లోని 16 నియోజకవర్గాల పరిధి నుండి మొత్తం 60,014 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.వి గౌతం వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కంప్యూటరైజ్డ్ పద్ధతిలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

అదే సమయంలో, నగరంలో ఇళ్లు లేని మిగతా అర్హులకు అవకాశం కల్పించేందుకు మరో 4 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా సెప్టెంబర్ 3వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఆన్మగల్‌లో, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు జమిస్తాన్‌పూర్‌లో.. అలాగే చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి బండ్లగూడ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఇటీవల కూకట్‌పల్లి పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తే కూకట్ పల్లి ప్రజలు తనను ఆశీర్వదించి ఢిల్లీకి పంపారని గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన తీరుగా అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు సీఎంగా కూకట్ పల్లిని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా మంత్రి శ్రీధర్ బాబు పనులు చేసి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల వారి పరిపాలనతో తమ రెండున్నరేళ్ల పాలనను బేరీజు వేసుకుంటే ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయన్నారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

పేదల సొంతింటి కల నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, స్థలం లేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఉచితంగా అందిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన దరఖాస్తులను పరిశీలించి, ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌లు, రేషన్ కార్డ్ వివరాలతో సరిపోల్చిన తర్వాతే అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఇందిరమ్మ కాలనీలలో కేవలం గృహాలు మాత్రమే కాకుండా మంచినీటి సదుపాయం, విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అన్ని రకాల కనీస మౌలిక వసతులను కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 4 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదల సొంతింటి కల సాకారం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Frequently Asked Questions

హైదరాబాద్‌లో ఇందిరమ్మ పథకానికి ఎంత స్పందన లభించింది?

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి విశేష స్పందన లభించింది. మొదటి విడతలో CURE పరిధిలోని 16 నియోజకవర్గాల నుండి 60,014 దరఖాస్తులు వచ్చాయి.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎలాంటి సహాయం అందుతుంది?

సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారు. స్థలం లేని వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తుంది.

ఇందిరమ్మ కాలనీలలో ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తారు?

ఇందిరమ్మ కాలనీలలో మంచినీటి సదుపాయం, విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అన్ని కనీస మౌలిక వసతులు కల్పిస్తారు.

ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది?

ఈ నెల 20వ తేదీ తర్వాత పారదర్శక పద్ధతిలో లాటరీ ప్రక్రియ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget