అన్వేషించండి

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

40 questions For India census | భారత్‌లో జనాభా లెక్కలలో అడిగే 40 ప్రశ్నల జాబితాను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ప్రశ్నలకు తప్పుడు సమాధానం ఇస్తే ఏం జరుగుతుందో ఇక్కడ పూర్తి వివరాలు అందిస్తున్నాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2027 జనాభా లెక్కలకు సరైన సమాచారం ఇవ్వడం పౌరుల బాధ్యత.
  • ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష, జరిమానా.
  • అధికారులు తప్పుచేసినా, సాంస్కృతిక ఆచారాలకు చట్టం వర్తిస్తుంది.

న్యూఢిల్లీ: భారత్‌లో 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గృహ సమగ్ర వివరాల సేకరణ (హౌస్‌హోల్డ్ షెడ్యూల్) ప్రక్రియ కింద అధికారులు ప్రజలను అడగబోయే 40 ముఖ్యమైన ప్రశ్నల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. ఈ సేకరణ ద్వారా దేశంలోని జనాభా, వారి జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైన అవగాహన వస్తుంది. అయితే, జనాభా లెక్కల సేకరణ సమయంలో అధికారులకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాధానాలు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, చట్ట ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉందా అనే అంశాలపై కొన్ని నిబంధనలు ఉన్నాయి.

1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం, మీ ఇంటికి వివరాలు సేకరించేందుకు వచ్చే అధికారులకు సరైన, వాస్తవ సమాచారాన్ని అందించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, జనాభా సేకరణ అధికారులు అడిగే ప్రశ్నలకు పౌరులు కచ్చితమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దేశ భవిష్యత్తు కోసం జాతీయ స్థాయి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా రూపొందించడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. అందువల్ల జనాభా సేకరణ అధికారులను కావాలని దారి మళ్లించడం లేదా తప్పుడు వివరాలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. కనుక ప్రజలు అధికారులకు సరైన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరుతున్నారు.

ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా, కీలక వివరాలను దాచిపెట్టినా లేదా అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నేరం నిరూపణ అయితే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా ₹1,000 వరకు జరిమానా, లేదా పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రెండూ విధించే అవకాశం ఉంది. అయితే పొరపాటున లేదా సరిగ్గా గుర్తులేక తప్పు చెప్పిన వారికి ఈ శిక్ష వర్తించదని చట్టం చెబుతోంది. కేవలం కావాలని మోసం చేసే ఉద్దేశం ఉందో లేదో మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, ఇల్లు కట్టిన సంవత్సరం సరిగ్గా గుర్తులేకపోతే ఊహించి ఏదో ఒక సంవత్సరం చెప్పడం కంటే సరిగ్గా తెలియదు అని నిజాన్ని చెప్పడం మంచిది.

అధికారులపై సైతం చర్యలకు అవకాశం

ఈ చట్టం కేవలం పౌరులపైనే కాకుండా వివరాలు సేకరించే అధికారులపై కూడా సమానమైన బాధ్యతను ఉంచింది. పౌరులు ఇచ్చిన సమాచారాన్ని అధికారులు కావాలని మార్చడం లేదా డిజిటల్ సిస్టమ్‌లో తప్పుగా నమోదు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. జనాభా సేకరణ, డేటా అప్‌లోడ్ చేయడంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అదే సమయంలో, ఈ చట్టం స్థానిక ఆచారాలు, సాంస్కృతిక పద్ధతులకు ఈ ప్రక్రియలో తగిన మినహాయింపులను కల్పించారు. స్థానిక పద్ధతుల ప్రకారం కుటుంబంలోని మహిళల పేర్లను బయటి వ్యక్తులకు చెప్పకూడదనే నిబంధన ఉన్నా, లేదా భర్త పేరు ఉచ్చరించకూడదనే సంప్రదాయం ఉన్నా, ఆ వివరాలు చెప్పడానికి నిరాకరించడాన్ని నేరంగా లేదా సమాచారాన్ని దాచడంగా పరిగణించరు. కానీ వివరాలు మాత్రం నమోదు చేయడానికి ఏదో విధంగా అందించక తప్పదు. లేకపోతే జనాభా లెక్కల్లో వారి వివరాలు మాయమయ్యే ప్రమాదం లేకపోలేదు.

Frequently Asked Questions

2027 జనాభా లెక్కల సేకరణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

దేశ జనాభా, జీవన ప్రమాణాలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. జాతీయ ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు అవసరమైన సమగ్ర డేటా దీని ద్వారా లభిస్తుంది.

జనాభా లెక్కల సేకరణలో తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి?

ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే 1948 జనాభా లెక్కల చట్టం సెక్షన్ 11 ప్రకారం చర్యలు తీసుకుంటారు. దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹1,000 జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.

తప్పుడు సమాచారం ఇచ్చినందుకు శిక్షల నుంచి మినహాయింపులు ఉంటాయా?

అవును, పొరపాటున లేదా సరిగ్గా గుర్తులేక తప్పు చెప్పిన వారికి శిక్షలు వర్తించవు. కేవలం కావాలని మోసం చేసే ఉద్దేశం ఉంటేనే నేరంగా పరిగణిస్తారు.

జనాభా లెక్కల అధికారులు కూడా చర్యలు ఎదుర్కొంటారా?

అవును, పౌరులు ఇచ్చిన సమాచారాన్ని కావాలని మార్చినా లేదా తప్పుగా నమోదు చేసినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయి.

సమాచారం ఇవ్వడంలో స్థానిక ఆచారాలకు చట్టం మినహాయింపు ఇస్తుందా?

అవును, స్థానిక పద్ధతుల ప్రకారం మహిళల పేర్లు చెప్పడానికి నిరాకరించడం నేరం కాదు. అయితే, వివరాలు మాత్రం ఏదో ఒక విధంగా నమోదు చేయడానికి సహకరించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
Delhi Protest: అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget