అన్వేషించండి

Census Self-Enumeration: జనగణన ప్రారంభం - మీ ఇంటి వివరాలు ముందుగా మీరే ఇలా నమోదు చేసుకోండి!

Census: జనగణన ప్రక్రియలో భాగంగా తొలిసారిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ సౌకర్యం ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ఇలా నమోదు చేసుకుంటే.. సిబ్బంది వచ్చినప్పుడు త్వరగా లెక్కింపు పూర్తవుతుంది.

Self Enumeration:  దేశవ్యాప్తంగా జరగనున్న  జనగణన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్  సౌకర్యం ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎన్యుమరేటర్ మీ ఇంటికి రాకముందే మీ వివరాలను మీరే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఏప్రిల్ 26  నుండి ప్రారంభమైంది.
  

భారతదేశ 16వ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, డేటాలో తప్పులు దొర్లకుండా ఉండేందుకు  సెల్ఫ్ ఎన్యుమరేషన్  విధానాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు  ఏప్రిల్ 26 నుండి మే 10, 2026 వరకు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు.

 నమోదు చేసుకునే విధానం  

1.   ముందుగా అధికారిక వెబ్‌సైట్ [se.census.gov.in](http://se.census.gov.in) ను సందర్శించాలి.
2.    మీ రాష్ట్రం (తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్)  జిల్లాను ఎంచుకోండి.
3.   మొబైల్ నంబర్ మ,  క్యాప్చా ఎంటర్ చేసి, ఓటీపీ (OTP) ద్వారా వెరిఫై చేయాలి.
4.   ఇంటి యజమాని పేరు నమోదు చేసి, భాషను ఎంచుకోవాలి.
5.    మీ నివాసం ఎక్కడుందో మ్యాప్‌లో పిన్ చేయాలి. దీనివల్ల ఎన్యుమరేటర్ మీ ఇంటిని గుర్తించడం సులభం అవుతుంది.
6.   కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి రకం, తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం, ఇంటర్నెట్, వాహనాలు వంటి వివరాలను నింపాలి.
7.   అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత  ఫైనల్ సబ్మిట్ చేయాలి. 
8.    సబ్మిట్ చేసిన వెంటనే మీ మొబైల్‌కు ఒక  SE ID (Self Enumeration ID) వస్తుంది. ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది.
  

 ఎందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి? 
ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు గంటల తరబడి వివరాలు చెప్పాల్సిన పని ఉండదు. 
మీ సమాచారం మీ కళ్ల ముందే నమోదవుతుంది కాబట్టి తప్పులు జరిగే అవకాశం ఉండదు.
ఉద్యోగస్తులు, వలస వెళ్లే వారు తమకు వీలైన సమయంలో వివరాలు నమోదు చేయవచ్చు.
ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ కాబట్టి డేటా సురక్షితంగా ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు 

* ఒక మొబైల్ నంబర్‌తో ఒక కుటుంబం వివరాలు మాత్రమే నమోదు చేయాలి.
* యజమాని పేరును ఒకసారి నమోదు చేశాక మార్చడం సాధ్యం కాదు.
* ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత వివరాలను ఎడిట్ చేయలేరు, కాబట్టి జాగ్రత్తగా నింపాలి.
* ఆన్‌లైన్‌లో వివరాలు నింపినప్పటికీ, ఎన్యుమరేటర్ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తారు. ఆ సమయంలో SE ID ని వారికి అందించాల్సి ఉంటుంది. 

ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించి, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మే 11 నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఈ స్వీయ గణన సౌకర్యాన్ని వినియోగించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు కోరుతున్నారు.                         


 

టాప్ హెడ్ లైన్స్

Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget